Take a fresh look at your lifestyle.

పురపోరుకు సిద్ధమవుతున్న నేతలు

  • ఉత్కంఠ రేపుతున్న చైర్మన్‌ ‌స్ధానాలకు రిజర్వేషన్లు
  • ఓటరు ముసాయిదాలో తీవ్ర అభ్యంతరాలు
  • అధికార టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల మద్యే తీవ్ర పోటీ
  • జిల్లాలో కనుమరుగవుతున్న బిజెపి
Telangana, municipal elections 2020, trs vs congress, bjp party, contestantsమరో రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయో మున్సిపాలిటీ ఎన్నికలకు ఆయా పార్టీలకు చెందిన నేతలు జిల్లా పరిధిలోని సూర్యాపేట, కోదాడ, హుజూ ర్‌నగర్‌, ‌నేరేడుచర్ల, తిరుమలగిరి ఆయా మున్సిపాలిటీల్లో  నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. రేపు  మున్సిపాలిటీల చైర్మన్‌ ‌పదవులకు రిజర్వేషన్లు దాదాప •గా ఖరారు కానున్నాయి. జిల్లా లోని ఐదు మున్సిపాలిటీలకు చైర్మన్‌ ‌పదవి ఎవరికి కేటాయిస్తా రననా దానిపై మరో కొద్ది గంటలు అగాల్సి ఉంది. రాష్ట్ర స్ధాయి మున్సిపాలిటీలకు రాష్ట్ర కమిషనర్‌ ‌రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా స్ధాయిలో కలెక్టర్‌ ‌వార్డులకు రిజర్వేషన్లు వెల్లడిస్తారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్‌ ‌స్ధానం కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. ఓటరు ముసాయిదా జాబితాలో అనేక అభ్యంతరాలు ఉన్నట్లు ఆయా పార్టీలకు చెందిన నేతలు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదులు చేయడం జరిగింది.  సూర్యాపేట. హుజూర్‌నగర్‌, ‌నేరేడుచర్ల, తిరుమ లగిరి మున్సిపాలిటీ పరిధిలో  సుమారు 186 అభ్యంతరాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓటరు నివాసిస్తున్న వార్డు కాకుండా వేరే వార్డులో ఓట్లు ఉన్నాయని అనేక మంది ఓటర్లు అభ్యంతరాల్లో తెలిపారు. అదే విధంగా కుల గణ విషయంలో కూడా అనేకం.  వెంటనే పరిష్కరించాలని ఫిర్యాదుల్లో పేర్కోంటున్నట్లు సమాచారం. ప్రాంతంలోఅధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఆశావహులు స్ధానిక మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కలిసి తమకు అవకాశం కల్పించాలని విన్నవించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాష్ట్ర జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ టిఆర్‌ఎస్‌ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు వ్యూహారచనలు చేస్తోంది.
Tags:-Telangana, municipal elections 2020, trs vs congress, bjp party, contestants

Leave a Reply