Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లో తెలంగాణ తల్లి బందీ

  • బిజెపి, టిఆర్‌ఎస్‌లు కలసి రాష్ట్రాన్ని దోచేస్తున్నాయ్‌
  • ‌వరి వేస్తే ఉరే అని కెసిఆర్‌ అనడం దుర్మార్గం
  • మేడ్చెల్‌ ‌కాంగ్రెస్‌ ‌కార్యకర్తల సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌
  • ‌గాంధీని చంపిందే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లే : కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ తల్లి సీఎం కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లో బందీ అయిందని, కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. బీజేపీ, టిఆరేస్‌ ‌రెండు పార్టీలు తోడు దొంగలేనని, రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌కలిసి దోచుకుంటున్నాయని రేవంత్‌ ‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ‘వరి వేస్తే ఉరే’ అని కేసీఆర్‌ ‌సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాడుతుందని ఆయన హావి• ఇచ్చారు. మంగళవారం కొంపల్లిలో కాంగ్రెస్‌ ‌పార్టీ డిజిటల్‌ ‌మెంబెర్‌ ‌షిప్‌ ‌డ్రైవ్‌ను సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో కలసి ఆయన ప్రారంభించారు. బ్లాక్‌, ‌మండల కాంగ్రెస్‌ ‌నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్‌ ‌మెంబర్‌ ‌షిప్‌ అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..ఎంత మంది నాయకులు పోయినా కాంగ్రెస్‌ ‌పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వొస్తుందని వివరించారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు జరుగుతుందని, క్రమశిక్షణ కాంగ్రెస్‌లో చాలా ముఖ్యం అన్నారు.

క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం కేసీఆర్‌ ‌మాటలు నిజం చేయొద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. తాము పదవులు అనుభవిస్తున్నామంటే కార్యకర్తల వల్లేనని, కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్లు చచ్చిన వాళ్ళతో సమానమని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, బాగా కష్టపడే వారికి రాహుల్‌ ‌గాంధీతో సన్మానం చేయిస్తానని హావి• ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత తానే చర్యలు తీసుకుంటానని రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరించారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలను రాహుల్‌ ‌గాంధీతో సన్మానం చేయిస్తా. కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటా. సోనియమ్మ రాజ్యం కోసం.. రాబోయే 18 నెలలు దీక్ష తీసుకుని పని చేయాలని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

వ్యక్తులు, నాయకులు వొస్తుంటారు.. పోతుంటారని..కానీ కార్యకర్తలే పార్టీకి ముఖ్యమన్నారు. శిక్షణా శిబిరంలో భట్టి మాట్లాడుతూ..‘దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌. ‌దేశంలో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. గాంధీయిజమే కాంగ్రెస్‌ ‌భావజాలం..కాంగ్రెస్‌ ‌సిద్దాంతం. కొన్ని రాజకీయ పార్టీలు దేశంలో వొస్తుంటాయి.. పోతుంటాయి కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్‌ ‌మాత్రమే. కాంగ్రెస్‌ ఎన్నో ఏళ్ళు అధికారంలో లేకున్నా..ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్‌ ‌జెండా మోస్తున్న ఘనత కార్యకర్తలది. ప్రధాని అయ్యే అవకాశం సోనియా గాంధీకి వొచ్చినా కూడా పార్టీ కోసం త్యాగం చేసిన గొప్ప నాయకురాలు. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా పనికి రారు. కాంగ్రెస్‌ ‌పార్టీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారంతో బురద జల్లుతున్నాయి. ప్రస్తుతం మతోన్మాద శక్తుల చేతుల్లో దేశం ఉంది. కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ‌కార్యకర్తలపై ఉంది. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ ఒకవైపు.. మరోవైపు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న టీఆర్‌ఎస్‌లను ఓడించాలి. టీమ్‌ ‌వర్క్ ‌తోనే గెలుపు సాధ్యం’ అని భట్టి పేర్కొన్నారు.

గాంధీని చంపిందే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లే : కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌సంచలన వ్యాఖ్యలు
మహాత్మా గాంధీజీని చంపింది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే అంటూ కాంగ్రెస్‌ ‌నేత ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 30 శాతం ఉన్న మైనార్టీలను బీజేపీ గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్దాంతం అవకాశవాదమన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సిద్దాంతం దాచుకోవడం.. దోచుకోవడమని వ్యాఖ్యానించారు. నెహ్రూను తక్కువ చేసి చూపించేందుకు బీజేపీ సావర్కర్‌ను తెరపైకి తీసుకువస్తోందని తెలిపారు. ఒక్క సంతకంతో దేశం మొత్తం రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీది అని గుర్తు చేశారు. దేశ చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ చెప్పుకోవాడనికి చరిత్ర లేదని.. అందుకే మరొకరి చరిత్రను తనదిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకుంటోం దన్నారు. రాజకీయ, న్యాయ వ్యవస్థలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు నాశనం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వొచ్చాక వి•డియా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply