- మహారాష్ట్రలో ఇంకెన్నాళ్లీ మంచినీటి గోస
- తెలంగాణలో ఇంటింటికీ మంచినీటి సరఫర
- కర్ణాటకలో గెలవగానే ఏదేదో మాట్లాడుతున్నారు
- నాందేడ్‌లో బిఆర్‌ఎస్ శిక్షణా శిబిరంలో సిఎం కెసిఆర్
నాందేడ్, ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే19: దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అబ్ కీ బార్ కిసాన సర్కార్ తమ నినాదమన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరి ంచారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశంలో సమస్యలు పరిష్కారం కాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నదేశాలైన సింగపూర్, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయని మెచ్చుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్టాల్ర మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు రాష్టాల్రు వేల కిలోటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక సమస్యలను పరిస్కరించుకున్నామని, కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తున్నామని, మహారాష్ట్రలో పలుచోట్ల వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వచ్చే దుస్థితి ఉందని సీఎం గుర్తుచేశారు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తున్నదని, రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.
దశాబ్దాల కాలం పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి ఏమి చేసిందని ప్రశ్నించారు. చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా అభివృద్ది చెందాయన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్టాల్రకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. మహారాష్ట్రలో వారానికోసారి తాగు నీరు వస్తుందంటూ.. పుష్కలంగా నీరు ఉన్నా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. దేశం మొత్తం మార్పు తీసుకురావాడానికే బీఆర్‌ఎస్ ఆవిర్భవించిందని కేసీఆర్ అన్నారు. స్వాతంత్యంర వచ్చి 75 ఏళ్లు దాటినా
సమస్యలు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక పరిష్కరించామన్న కేసీఆర్.. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కావడం లేదన్నారు. మహారాష్ట్రలో త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ కమిటిలు ఏర్పాటు చేస్తామన్నారు. కర్నాటక ఫలితాలు వచ్చిన తరువాత ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికి మహారాష్ట్ర నాంది కావాలని స్పష్టంచేశారు. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి ఇతర రాష్టాల్ల్రో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. దేశంలో రైతులు ఎప్పుడూ పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకని నిలదీశారు.
దేశమంతటా ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. దేశ రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని చెప్పారు. దేశంలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నా వాడుకోలేక వృథా చేస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల వర్షం పడుతుంటేమనం కేవలం 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నామని అన్నారు. ఇదీ దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన వారి పనితీరు అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. రైతులు ఎల్లకాలం పోరాటాలు చేస్తూ బలికావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద దేశంలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టకూడదని ప్రశ్నలేవనెత్తారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా తెలంగాణ మాడల్ కావాలని కోరుకుంటు న్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, విద్వేష రాజకీయాలు చేసిన బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని చెప్పారు. కర్ణాటక ఫలితాల తర్వాత కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని, వారి కలలు కల్లలే అవుతాయని అన్నారు.శిక్షణ శిబిరం ద్వారా పలువురు ఇతర పార్టీల ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్ పార్టీలో చేరాలన్నారు. పార్టీలో చేరేవాళ్లకు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడే తెగువ ఉండాలని, నిత్యం ప్రజలతో మమేకమై వారిని చైతన్యపర్చాలని సూచించారు. ఒకసారి అడుగు ముందుకు వేస్తే వెనుకడుగు వేసేది లేదని చెప్పారు. మన లక్ష్యం గొప్పదని, త్వరలోనే పార్టీ కమిటీలు నియమించుకుందామని అన్నారు. అదేవిధంగా శిబిరంలో జరిగే శిక్షణ తరగతుల సమాచారాన్ని డిజిటల్ రూపంలో అందిస్తామని, అందరూ వాటిని సమగ్రంగా తెలుసుకోవాలని సీఎం కోరారు.