దేశ రాజధాని ఢిల్లీలో పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులతో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కేంద్రం తీరు బాధాకరంగా ఉందని తెలంగాణ మంత్రులు పెదవి విరిచారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రులకు కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. పీయూష్ గోయల్ తో గంటపాటు సాగిన తెలంగాణ మంత్రుల భేటీలో .. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు వివరంగా చర్చించినా ఫలితం శూన్యం.కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రుల చర్చలు విఫలం అయ్యాయి. యాసంగి వడ్లు కొనేందుకు సిద్ధంగా లేమని కేంద్రం తేల్చిచెప్పింది. ఏడాదికి ఎంత సేకరిస్తారో చెప్పడం అసాధ్యమన్నాని కేంద్రం అంది.నిరాశతోనే మేము వెనుదిరుగుతున్నాం అని తెలంగాణ మంత్రులు తెలిపారు.
యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం చెబుతోంది. రాష్ట్ర భాజపా నేతలు వరి వేయాలంటున్నారని కేంద్రమంత్రికి తెలియ జెప్పిన తెలంగాణ చెప్పిన రాష్ట్ర మంత్రులు. భాజపా నేతలకు సైతం ఇప్పుడు చెబుతున్నామని పీయూష్ గోయల్ సమావేశంలో అన్నారు.వానాకాలంలో 62 లక్షల ఎకరాలలో వరి వేశామంటే ఒప్పుకోని కేంద్రం కాలయాపన చేసింది అని, తాజాగా శాటిలైట్ సర్వే చేసి 58 లక్షల ఎకరాలలో వరి వేసినట్లు ఒప్పుకుంది అని తెలంగాణ మంత్రులు అన్నారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గారు, పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి, ఎంపీలు తదితరులు కేంద్రం తీరు నిరాశపరిచింది అన్నారు.