Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం నీళ్లకు మంత్రి హరీష్‌రావు జల హారతి

గంగమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు
మంత్రి తన్నీరు హరీష్‌రావు రాఘవాపూర్‌లో కాళేశ్వరం నీళ్లకు జల హారతి ఇవ్వడంతో పాటు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరు అందించే క్రమంలో కాలువ ద్వారా నీళ్లను వదిలారు. దీంతో గత ఐదు రోజులుగా వస్తున్న కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్‌ ‌గ్రామ పెద్ద చెరువు నిండి అలుగు పారింది.

ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు గంగమ్మ తల్లికి జల హారతి పట్టారు. ఆ తర్వాత గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట సుడా ఛైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు శ్రీనివాస్‌రావు, గ్రామ, మండల ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

Leave a Reply