Take a fresh look at your lifestyle.

నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

  • అభివృద్ధి పథంలో తెలంగాణ, అదే బాటలో నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా?
  • ప్రభుత్వ విప్‌ ‌కూచకుళ్ల దామోదర్‌ ‌రెడ్డి  
  •  సుదీర్ఘ పోరాట ఫలితమే తెలంగాణ

నాగర్‌ ‌కర్నూల్‌, ‌జూన్‌ 2. ‌ప్రజాతంత్రవిలేకరి: కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ‌కా ర్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిరాడం బరంగా కొనసాగాయి.తెలంగాణ రాష్ట్రం ఆ విర్భవించి ఆరు సంవత్సరాల కాలంలో అభి వృద్ధి పథంలో నడుస్తున్నదని ప్రభుత్వ విప్‌ ‌రాష్ట్ర శాసనమండలి సభ్యులు కూచకుళ్ల దామోదర్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్‌ ‌కర్నూ ల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.పోలీస్‌ ‌శాఖ ఆధ్వర్యంలో విప్‌ ‌కు గౌరవ వందనం సమర్పించారు. అంతకు ముందు అమర వీరుల స్థూపానికి పూల మాలలు సమర్పిం చి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘనంగా ముఖ్యఅతిధితో పాటు జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌శ్రీమతి పద్మావ తి, జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌, ఎస్పి సాయి శేఖర్‌, ఎం‌పీ రాములు నివాళులర్పించారు.అనం తరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధి విప్‌ ‌దామోదర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. పెండింగ్‌ ‌ప్రా జెక్టులు పూర్తి చేసుకొని కొత్త ప్రాజెక్టులు ని ర్మించుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.ఈ క్రమంలో వెనకబడిన ప్రాంతమైన నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కూడా అభివృద్ధి వైపు పరుగులు తీస్తు న్నదన్నారు.జిల్లాలో లక్షా 3,679 మంది ఆసరా పెన్షన్‌ ‌లు పొందుతున్నారన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో ఒక లక్షా1,17,238 మంది కూలీలకు 17.0 2 లక్షల పని దినాలు కల్పించామన్నారు.2020-2021 సంవత్సరానికిగాను స్త్రీ నిధి ద్వారా 270 సంఘాలకు 2.74 కోట్ల రుణా లు ఇచ్చినట్లు ఆయన వివరించారు.

లాక్‌ ‌డౌన్‌ ‌లో ఉపాధి కోల్పోయిన పేదలకు ఏప్రిల్‌, ‌మే, జూన్‌ ‌మాసాలకు ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున రేషన్‌ ‌బియ్యం అందించినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీల కు 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా మే మరియు జూన్‌ ‌మాసాలకు అందజేయడం జరిగిందన్నారు.ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 46 వేల మందికి ఏప్రి ల్‌ ‌మే నెలలో పౌష్టికాహారం నేరుగా ఇంటికే సరఫరా చేశామన్నారు.తాము పండించే పంటకు రైతు ధర నిర్ణయించే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో నియంత్రిత వ్యవ సాయ పద్ధతిని ఈ వానాకాలం నుంచి అమ ల్లోకి వచ్చినట్లు విప్‌ ‌వివరించారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 2019 వాన కాలంలో 5,53, 559 ఎకరాలు కాగా 5,62,299 ఎకరాలకు ప్రణాళిక తయారు చేసినట్టు తెలిపారు. జి ల్లా లోనే 142 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం కోసం స్థల సమీకరణ పూర్తయిందన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు ఎరువులు ముందే సమీకరించి నిల్వచేసి సకాలంలో రైతులకు సరఫరా చేస్తున్నామన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2019-20 సంవత్సరంలో 483 చెరువులను నింపి ఆయకట్టుకు నీరు ఇవ్వడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి 3.98 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల మేర నమోదైంద న్నా రు. 2019 ఆగస్టు 14 నుంచి 520 మంది రైతులు చనిపోతే రైతు బీమా పథకం ద్వా రా నామిని లకు 23.30 కోట్లు బీమా పరిహా రం ఎల్‌ఐసి ద్వారా లబ్ధిదారులకు చెల్లించ డం జరిగింది అన్నారు.కరోనా మహమ్మారి నుంచి జిల్లాను రక్షించేందుకు జిల్లా స్థాయి లో 5, డివిజన్‌ ‌స్థాయిలో 4, మండల స్థాయి లో 20, గ్రామ స్థాయిలో ఐదు వందల నలభై ఏడు ర్యాపిడ్‌ ‌రెస్పాన్స్ ‌టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.10 మొబైల్‌ ‌హెల్ప్ ‌టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తు న్నామ న్నారు.జిల్లాలో ఐదు ఆస్పత్రులను గుర్తించి 120 ఐసొలేషన్‌ ‌మంచాలను సిద్ధం చేశామ న్నారు.

ఐదు ప్రభుత్వ క్వారంటైన్‌ ‌కేంద్రాల ను ఏర్పాటు చేసి110 పడకలు సిద్ధం చేశా మన్నారు.113 అనుమానిత కరోనాశాంపి ల్స్ ‌తీసి పరీక్ష కేంద్రానికి పంపగా ఇందులో 2 పాజిటివ్‌, 111 ‌నెగెటివ్‌ ‌ఫలితాలు వచ్చా యన్నారు.ఆరో విడత తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో జిల్లాలో 74.40 లక్షల మొక్కలు నాటేందుకు 461 గ్రామాల్లోని నర్సరీల్లో 85 లక్షల మొక్కలు పెంచామన్నా రు. జూన్‌ ఒకటవ తేదీనుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టా మన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా టీఎస్‌ ఐపాస్‌ ‌చట్టం ద్వారా జిల్లాలో 84 ఉత్సాహిత పారిశ్రామికవేత్తలకు వివిధ శాఖ ల నుంచి 228 అనుమతులు ఇచ్చిన ట్లు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రత లు అదుపు లో ఉన్నాయని,19 శాతం తగ్గాయన్నారు. 2018 సంవత్సరంలో 3,429 కేసులు నమోదు కాగా 2019లో 2,781 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌, ఎస్పీ సాయి శేఖర్‌, ఇతర జిల్లా అధికారులకు ధన్యవా దాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌చైర్పర్సన్‌ ‌పద్మావతి, జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌, ‌జిల్లా ఎస్పీ డాక్టర్‌ ‌వై సాయి శేఖర్‌ ఎం‌పీ రాములు అదనపు కలెక్టర్లు మను చౌదరి, హనుమంత్‌ ‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్‌ ‌చిత్ర మిశ్రా, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ ‌రెడ్డి, నాగర్‌ ‌కర్నూల్‌ ‌చైర్మన్‌ ‌కల్పనా, జిల్లా అధికారులు మధుసూదన్‌ ‌నాయక్‌, ‌డాక్టర్‌ అం‌జిలప్ప, మోహన్‌ ‌రెడ్డి చంద్రశేఖర్‌, అనిల్‌ ‌ప్రకాష్‌ ‌రెవిన్యూ మరియు పోలీస్‌ ఇతర శాఖల అధికారులు కౌన్సిలర్లు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!