Take a fresh look at your lifestyle.

తెలంగాణ లాక్‌డౌన్‌ ‌మార్గదర్శకాలు

  • కెటిఆర్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
  • వ్యవసాయం, మీడియా, విద్యుత్‌ ‌రంగాలకు మినహాయింపు
  • ఎటిఎంలు, బ్యాంకులు యధావిధిగా పని చేస్తాయి
  • 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ,మెట్రో సర్వీసులకు అనుమతి
  • ఉదయం సమయంలో వైన్‌ ‌షాపులు యధావిదిగా తెరుచుకోవచ్చు
  • ఈ నెల 20న మరోసారి కేబినెట్‌ ‌భేటీలో లాక్‌డౌన్‌పై సమీక్ష

కొరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కార్‌ ‌రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌విధిస్తూ  తీసుకున్న నిర్ణయం మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.  దాదాపు మూడు గంటల పాటు జరిగిన కేబినెట్‌ ‌భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 20న మరోసారి కేబినెట్‌ ‌భేటీ జరగనుంది. లాక్‌డౌన్‌ ‌కొనసాగించడమా లేదా అన్న దాని గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయం, వి•డియా, విద్యుత్‌ ‌రంగాలకు లాక్‌డౌన్‌ ‌నుంచి మినహాయింపు నిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులన్ని 33 శాతం సిబ్బందితోనే పని చేస్తాయి. బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా కార్యక్రమాలు కొనసాగిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యకలపాలు, ఉపాధి హావి• పనులకు లాక్‌డౌన్‌ ‌నుంచి మినహాయింపు లభించింది. సినిమా హాల్స్, ‌స్విమ్మింగ్‌ ‌ఫూల్‌లు, జిమ్ములు మూసివేయాలని ఆదేశించారు. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు,మెట్రో సర్వీసులు నడుస్తాయి. సిటీ బస్సులు, జిల్లా సర్వీసులు కూడా లాక్‌డౌన్‌ ‌సడలింపు సమయంలోనే నడుస్తాయి.

ఆయా డిపోల పరిధిలో బస్సుల సమయాలను సడలింపు చేస్తారు. ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపమని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణాకు అనుమతి ఇచ్చింది. అంత్యక్రియలకు 20 మంది.. వివాహాలకు 40 మందికి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది.ఇకపోతే  యుద్ధ ప్రాతిపదికన కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌కోసం గ్లోబల్‌ ‌టెండర్లు పిలవాలని క్యాబినెట్‌ ‌నిర్ణయించింది.  ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్‌ ‌రంగంలో కూడా రెమిడెసివిర్‌ ఇం‌జక్షన్లు, ఆక్సిజన్‌, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌ను క్యాబినెట్‌ ఆదేశించింది.అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్‌, ‌డీఎంహెచ్‌ఓ, ‌జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్‌, ‌డ్రగ్‌ ఇన్‌ ‌స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సవి•క్ష చేయాలని సీఎం ఆదేశిచారు.  రెమిడెసివిర్‌ ఇం‌జక్షన్‌ ఉత్పత్తిదారులతో క్యాబినెట్‌ ‌సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.

చంద్రశేఖర్‌ ‌రావు రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం పరిశ్రమల శాఖా మంత్రి కెటిఆర్‌  అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ‌ఫోర్స్ ‌నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ ‌రంజన్‌, ‌జీఏడీ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ శ్రీ వికాస్‌ ‌రాజ్‌, ‌పంచాయతీరాజ్‌ ‌ముఖ్య కార్యదర్శి సందీప్‌ ‌సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్‌ ‌ప్రత్యేకాధికారి రాజశేఖర్‌ ‌రెడ్డి ఈ టాస్క్ ‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.

Leave a Reply