Take a fresh look at your lifestyle.

రైతులకు మద్దతుగా న్యాయవాదుల నిరసన

ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా కూకట్ పల్లి కోర్టు వద్ద ఆలిండియా లాయర్స్ యూనియన్, ఇండియా అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నను అధోగతి పాలు చేసే విధంగా కేంద్రం చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత తొమ్మిది రోజులుగా తిండి తిప్పలు మాని వయసుతో నిమిత్తం లేకుండా చలిలో చావును కూడా లెక్కచేయకుండా రైతులు ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పుకునే ఇక్కడ రైతులకు ఇలాంటి దృష్టికి తీసుకు రావడం ఎంతో దుర్మార్గమన్నారు. రైతులం దరిని ఆదుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా లాయర్ సీఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె ఎస్ శర్మ, అన్నం కూకట్ పల్లి కోర్టు న్యాయవాదులు బి.ఎన్. సుదర్శన్, రంగన్న, బాలఫీరు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply