Take a fresh look at your lifestyle.

రేపు ఢిల్లీకి సిఎం కెసిఆర్‌

‌మూడ్రోజుల పర్యటనలో 2న పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన
ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దేశ రాజధాని రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ఢిల్లీ పర్యటన ఉండనుంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 1‌న మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. 2న మధ్యాహ్నం 12:30 గం. ల నుంచి ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయం భూమి పూజ చేయనున్నారు. ఇక సీఎం కేసీఆర్‌తో పాటు భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు పాల్గొననున్నారు.

ఢిల్లీలోని వసంత్‌ ‌విహార్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌పక్కన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300ల గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక భూమి పూజ కార్యక్రమం అనంతరం సెప్టెంబర్‌ 3‌న మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్ళిన సిఎం కెసిఆర్‌ ‌మళ్ళీ..సెప్టెంబర్‌ 1 ‌వెళ్లనున్నారు.

Leave a Reply