Take a fresh look at your lifestyle.

జూడాలు సమ్మె విరమించినట్లు ప్రచారం అలాంటిదే లేదు..! ప్రకటించిన గాంధీ డాక్టర్లు

‌గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ ‌డాక్టర్లు విధుల్లోకి వెళ్లడంలేదు. చర్చలు సఫలమని ప్రభుత్వమే ప్రకటించుకుందని, కానీ తామింకా సమ్మెలోనే ఉన్నామని జూనియర్‌ ‌డాక్టర్లు ప్రకటించారు. సమ్మె నోటీసు ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా భారం తగ్గించాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హా ఇచ్చే వరకు విధులకు వెళ్లేది లేదని జూడాలు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి నుంచి గాంధీలో జూడాలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు 3 వందల మంది గాంధీ ఆస్పత్రి ఎదుట ప్రధాన రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. బుధవారం మంత్రి ఈటల వారితో చర్చలు జరిపారు.

వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సీఎం దృష్టికి జూడాల డిమాండ్లు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హా ఇచ్చారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరారు. అయితే మంత్రి స్పష్టమైన  హా ఇవ్వకపోవడంతో తమ ఆందోళన కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు. అయితే  గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్‌ ‌డాక్టర్లు శుక్రవారం ఉదయం సమ్మె విరమించారని, తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు జూనియర్‌ ‌డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ‌పీ లోహిత్‌ ‌రెడ్డి ప్రకటించారు. మంత్రి ఈటల హాతో భవిష్యత్‌ ‌కార్యాచరణపై జూడాలు అంతర్గతంగా చర్చించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్‌ ‌డాక్టర్లు ప్రకటించారు. అయితే తాజాగా వారు చేసిన ప్రకటనతో సమ్మె విరమణ అంతా ఉత్తిదే అని తేలింది.

Leave a Reply