Take a fresh look at your lifestyle.

అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమంలో వీరమరణం పొందిన అమర వీరులను స్మరించుకుంటూ అమర వీరుల స్మారక స్తూపం వద్ద ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌, ‌రాష్ట్ర పంచాయతీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావులు కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ ‌మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ ‌ప్రాణాలకు తెగించి అన్ని వర్గా ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేసి తెంగాణ సాధించుకున్నామన్నారు. ఉద్యమ నాయకుడే ప్రభుత్వ పాలన చేస్తూ రాష్ట్రాన్ని ఆరు సంవత్సరాల నుండి అభివృద్ధిలో అగ్రగామిగా, ఆదర్శంగా రూపుదిద్దుకుంటుం దన్నారు. ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న మందులేని మహామ్మారి కొరోనాను తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ్నా నిబంధన మేరకు అధికారుల సేవలు , ప్రజల సహకారం, ప్రజా ప్రతినిధుల ప్రోద్బల•ం తో జిల్లాలో అరికట్టామన్నారు. జిల్లాలో కొరోన వైరస్‌ ‌ప్రభావం గల 17 ప్రభావిత ప్రాంతాను కంట్కెన్మెంట్‌ ‌జోన్‌లుగా గుర్తించి 28 మొబ్కెల్‌ ‌మార్కెట్‌ ‌వాహనలను ఏర్పాటు చేసి పోలీసు, మున్సిపాలిటి, మార్కెట్‌ ‌శాఖ సిబ్బందిని టీమ్‌ ‌సభ్యులుగా నియమించి నందున 58 వేల 580 కుటుంబాకు సేవందించిన వారందరికి అభినందనలు తెలిపారు.

వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో యాసంగిలో మొక్కజొన్న 41వేల547 ఎకరాలో పంట సాగు చేయగా, ఒక లక్షా 30 వేల మెట్రిక్‌ ‌టన్ను పంట దిగుమతి అవుతుందని అంచనా వేయడం జరిగిందన్నారు. 17 వేల 454 మంది రైతులకు ప్రభుత్వం నిర్థేశించిన కాల వ్యవధిలో 146 కోట్ల 34లక్ష రూపాయను రైతు బ్యాంక్‌ ‌ఖాతాకు జమ చేశామన్నారు. రైతును రారాజును చేసి ప్రపంచంలోనే తెలంగాణ రైతు ఆదర్శంగా నిలవాలని దృఢ సంక్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. రైతు బంధు ద్వారా 2019-20 సంవత్సరానికి వానా కాల పంటకి 78 699 మంది రైతులకు రూ.86.05 కోట్లు, యాసంగి పంటకి 54 వేల301మంది రైతుకు రూ.53.76 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమచేశామన్నారు. వరంగల్‌ ‌నగరంలో నివసించే ప్రజల కోసం కనీస సౌకర్య్నా కల్పించడం కోసం సమగ్ర అభివృద్ధికి స్మార్ట్ ‌సిటి పథకం ద్వారా రూ.425 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 31 వివిధ పనును చేపట్టినట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని యువతీ, యువకుకు ఉపాధి కల్పించేందుకు మెగా టెక్స్ట్కెల్‌ ‌పార్కు, ఐటితో పాటుగా గోనె సంచుల తయారి పరిశ్రమను నెకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అర్బన్‌, ‌రూరల్‌ ‌కలెక్టర్లు రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు, హరిత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జడ్పీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌సుదీర్‌ ‌కుమార్‌, ‌రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌, ‌పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్‌, ‌వరంగల్‌ ‌తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, ‌నగర మేయర్‌ ‌గుండా ప్రకాష్‌, ‌కూడా చైర్మెన్‌ ‌మర్రి యాదవ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మెన్‌ ‌సాంబరి సమ్మరావు, నగర పాలక కమిషనర్‌ ‌పమేలా సత్పతి, మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్‌, ‌వరంగల్‌ అర్బన్‌, ‌రూరల్‌ అదనపు జిల్లా కలెక్టర్లు దయానంద్‌, ఆర్‌. ‌మహేందర్‌ ‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ ‌ఖాన్‌ ‌వివిధ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply