Take a fresh look at your lifestyle.

పారిశ్రామికరంగానికి తెలంగాణ పెద్దపీట

  • నిరంతర విద్యుత్‌తో సమస్యకు పరిష్కారం
  • జర్మన్‌ ‌సదస్సులో మంత్రి కెటిఆర్‌

పరిశ్రమల అభివృద్దికి అడ్డంకిగా ఉన్న విద్యుత్‌ ‌సమస్యను అధిగమించామని, పరిశ్రమలకునిరంతరాయంగా విద్యుత్‌ ‌సరఫరాచేస్తున్నామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. చిన్న తరహా పరిశ్రమలే జర్మనీ జీడీపీ వృద్ధికి సహకరిస్తున్నాయని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఏడున్నరేండ్ల సీఎం కేసీఆర్‌ ‌పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించాం. తొలి ప్రాధాన్యతగా విద్యుత్‌ ‌సమస్యను పరిష్కరించాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ ‌సరఫరా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హాటల్‌లో జర్మనీ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌ ‌జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. పదిహేనురోజుల్లో అనుమతులు ఇచ్చేలా టిఎస్‌ ‌పాస్‌ అమలుచేస్తున్నామని అన్నారు. జర్మనీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 2 వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయని పేర్కొన్నారు. జర్మనీ ప్రభుత్వం, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పరిశ్రమలకు సింగిల్‌ ‌విండో విధానంలో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. అమెరికాలో కూడా టీఎస్‌ ఐపాస్‌ ‌లాంటి చట్టం లేదని స్పష్టం చేశారు. టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా 17,500 కంపెనీలకు ఇప్పటి వరకు క్లియరెన్స్ ఇచ్చామని కేటీఆర్‌ ‌తెలిపారు. ఇదిలావుంటే భవిష్యత్తుకు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయమని మంత్రి కెటిఆర్‌ ‌ప్రశంసించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్‌ అం‌బేద్కర్‌ ‌వర్ధంతి సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌నివాళులు అర్పించారు.

బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినదన్నారు. ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేద్కర్‌ ఆలోచనలే తమకు ప్రాతిపదిక అని కెటిఆర్‌ ‌పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. ••బాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌వర్ధంతి సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌, ‌మంత్రి సిహెచ్‌ ‌మల్లారెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్‌, ‌ప్రకాష్‌ ‌గౌడ్‌, ‌కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌ ‌రెడ్డి, నవీన్‌ ‌కుమార్‌, ‌పలువురు ప్రజాప్రతినిధులు ప్రగతి భవన్‌ ‌లో నివాళులు అర్పించారు.

Leave a Reply