Take a fresh look at your lifestyle.

ప్రజాసంఘాల బ్యాన్ సిగ్గు చేటు…! డా. చెరుకు సుధాకర్

తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంఘాలు JACగా పనిచేశాయి.. ఒక్క రాజకీయ పార్టీలతో సాధ్యం కాలేదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా.చెరుకు సుధాకర్ అన్నారు. వరవరరావు బెయిల్ కోసం పట్టుపడుతున్నరని కొన్ని సంఘాలను బ్యాన్ చెయ్యడం విడ్డూరంగా ఉందని ఉద్యమ సమయంలో వరవరరావు ని జైలు నుండి ర్యాలీగా తీసుకొచ్చిన కెసిఆర్ పార్టీని కూడా బ్యాన్ చెయ్యాలి కదా.. ఎందుకు చెయ్యలేదని అని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పనిచేసేవి పోరాటాలు చేసేవి సంఘలే అని అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాసంఘాల పై బ్యాన్ దిక్కు మాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను కూడా ప్రజలకు విప్పి చెప్పి పోరుకు సిద్దం చేసింది సంఘాలే అని గుర్తు చేశారు. కెసిఆర్ కి ఉద్యమం, ప్రజపొరటాల పై ఏ మాత్రం గౌరవం ఉన్న వరవరరావు ని విడుదల చేయించి తెలంగాణకు గౌరవప్రదంగా తీసుకు రావాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.

కేంద్రం ఆడించే ఆటలో కెసిఆర్ పావు కాకుడదని చెరుకు సుధాకర్ హితవు పలికారు. కొత్తగా నియమితులైన సుప్రీం కోర్టు సిజే నల్ల చట్టాలపై పునసమిక్షించి సంఘలపై బ్యాన్ ఎత్తివేయాలని చెరుకు సుధాకర్ సీజే కి లేఖ రాశారు.

Leave a Reply