Take a fresh look at your lifestyle.

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో క్లీన్‌ అం‌డ్‌ ‌గ్రీన్‌తోపాటు శానిటైజేషన్‌ ‌కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్‌ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ..జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్‌ ‌గదులు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రం ఆవరణలో, బయట నీడ లేకుంటే ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది. విద్యుత్‌, ‌తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశా వర్కర్స్, ఏఎన్‌ఎం‌లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. డీహైడ్రేషన్‌ ‌నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓఆర్‌ఎస్‌ ‌ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

పరీక్ష కేంద్రంలో వాటర్‌ ‌బాటిల్‌ ‌మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులను లోనికి అనుమతించరు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,443 ఇంటర్‌ ‌పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ‌విధించారు. అన్ని గ్రూపులకు చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.07 లక్షల మంది హాజరుకానున్నారు. 150 మంది సిట్టింగ్‌ ‌స్క్వాడ్‌లు, 75 మంది ఫ్లయింగ్‌ ‌స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించొద్దని నిర్ణయించారు. విద్యార్థుల ఓఎంఆర్‌ ‌షీట్లలో తప్పులు దొర్లితే అక్కడికక్కడే సరిచేసి ఇవ్వనున్నారు. అన్ని కేంద్రాల్లో విద్యుత్తు, మంచినీటి సదుపాయాలు ఉంటాయి. అత్యవసర వైద్య సేవల కోసం ఆశావర్కర్లు, ఏఎన్‌ఎం ‌సిబ్బంది అందుబాటులో ఉంటారు.

Leave a Reply