Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్‌ ‌నిర్వాకంతో అప్పుల ఊబిలో తెలంగాణ

BJP state president Dr Lakshman

  • కుటుంబ సభ్యులకు రాజకీయ ఉపాధి
  • నిరుద్యోగ యువతకు మొండిచెయ్యి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సీఎం కసీఆర్‌ ‌నిర్వాకంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయిందనీ పింఛన్‌దారులకు పింఛన్‌లు కూడా చెల్లించే పరిస్థితిలో లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ ‌ధ్వజమెత్తారు. షాదీ ముబారక్‌, ‌రైతు బంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలను పక్కనబెట్టారని నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నందుననే సంక్షేమ పథకాలను సైతం అమలు చేయలేక పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కేవలం వాగ్దానాలకు ఆడంబరాలకు మాత్రమే పరిమితమయ్యారని ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని ఎన్నికల సందర్భంగా గెలవడం కోసం వేదికలపై వాగ్దానాలు ఇవ్వడం గెలిచిన తరువాత వాటిని విస్మరించడం సీఎంకు పరిపాటిగా మారిందని విమర్శించారు. ఈమేరకు ఆయన గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌లతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక, ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో ప్రజలను సీఎం తప్పుదోవ పట్టించారనీ, ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. పీఆర్సీ కోసం డిమాండ్‌ ‌చేసిన ఉద్యోగులను రాష్ట్ర ముఖ్యమంత్రి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేయడం తగదనీ, ఇటీవల తహశీల్దార్లు రోడ్లపైకి వస్తే ఆ వ్యవస్థనే రద్దు చేస్తామని సీఎం హెచ్చరించడం శోచనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 120 తహశీల్దార్‌ ‌పోస్టలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదనీ, సీనియర్‌ ‌తహశీల్దార్లకు ఇవ్వాల్సిన డిప్యూటీ కలెక్టర్‌ ‌పదోన్నతులను పెండింగ్‌లో పెట్టారని పేర్కొన్నారు. చదువుకున్న విద్యా వంతుల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారనీ, ఉద్యోగుల చిన్నచిన్న కోర్కెలను కూడా సీఎం నెరవేర్చడం లేదని ఆరోపించారు.

ఎన్నికల సందర్భంగా చదువుకున్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చిన సీఎం కనీసం ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరేళ్లలో యాభై వేల మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారనీ, కానీ, 20 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో చిక్కుకు పోయిందనీ పింఛన్‌దారులకు కూడా పింఛన్‌లు చెల్లించే పరిస్థితిలో లేదని అన్నారు. షాదీ ముబారక్‌, ‌రైతు బంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలను పక్కనబెట్టారని నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నందుననే సంక్షేమ పథకాలతో అమలు చేయలేక పోతున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతికి ఇచ్చిన హామీని సైతం సీఎం నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యులందరికీ రాజకీయ ఉపాధి లభించింది కానీ, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో నార్సింగ్‌ ‌కో ఆపరేటివ్‌ ‌సొసైటీకి ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన సత్యనారాయణను ఈ సందర్భంగా డా.లక్ష్మణ్‌ ‌సన్మానించారు. మార్చి 15న ఎల్బీ స్టేడియంలో అమిత్‌ ‌షా సభమార్చి 15న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షాతో సీఏఏకు అనుకూలంగా ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు డా.లక్ష్మణ్‌ ‌వెల్లడించారు. ఈ సభకు జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎంఐఎం అధినేత ఒవైసీ కోసం మెప్పు కోసం సీఎం కేసీఆర్‌ ‌సీఏఏను వ్యతిరేకిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన మంత్రి ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు పీఆర్సీని చెల్లించని పక్షంలో వారి పక్షాన ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.