Take a fresh look at your lifestyle.

కోవిడ్‌-19 ‌కట్టడిలో దేశానికే తెలంగాణ ఆదర్శం..!

“ఆం‌ధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రంతో పోల్చితే తెలంగాణలో కొరోనా పరీక్షలు విరివిగా చేయకపోవడం, కేసుల మరియు మరణాల రిపోర్టు తక్కువగా చూపించడం చేస్తున్నారనే వాదనలు చేసే వారు అనేకం ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణలో వైద్య వసతులు అధికంగా ఉండడంతో కేసుల రికవరీలు అధికంగా, మరణాల రేటు సహజంగానే తక్కువగా ఉందని అభిప్రాయ పడవచ్చు. కొరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాలు మరియు మహానగరాల్లో సాంఘీక నిర్ణాయకాలు జనసాంద్రత, కనీస వసతులు, నీటి లభ్యత, పారిశుద్ధ్యం, వలసదారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ప్రజలు లాంటి అంశాలు కొరోనా వ్యాప్తిని, కట్టడిని, మరణాలను ప్రభావితం చేస్తున్నాయి.”

(07 మే ‘జర్నల్‌ ఆఫ్‌ ‌సోసియో-ఎకనమిక్‌ ‌డెవలప్‌మెంట్‌’‌లో ప్రచురితమైన అన్వేషణాత్మక అధ్యయనం ఆధారంగా)
ప్రపంచ మానవాళి ఊహించని మహమ్మారి సృష్టించిన ప్రజారోగ్య సంక్షోభంలో ఉన్నది. డిసెంబర్‌-2019‌లో చైనాలోని వూహాన్‌ ‌నగరంలో పుట్రిన కొరోనా విష వైరస్‌ ‌కేరళ రాష్ట్రంలోకి త్రిసూర్‌ ‌జిల్లాలో 30 జనవరి 2020న తొలి కేసు రూపంలో బయట పడింది. నేడు ఇండియాలో ప్రతి రోజు 3 – 4 లక్షల కేసులు మరియు 3 – 4 వేల మరణాలతో రెండవ అల సునామీతో నిస్సహాయ దుస్థితిలో మానవాళి కొట్టుమిట్టాడుతోంది. భారత ప్రభుత్వాలు కొరోనా తొలి మరియు రెండవ అలలను కట్టడి చేయటానికి పలు దఫాలుగా లాక్‌డౌన్‌లు కూడా ప్రయోగించడం, ప్రచార ప్రసార సామాజిక మాద్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం, కోవిడ్‌-19 ‌రోగులకు వైద్య సదుపాయాల కల్పన, ఆరోగ్య సేతు యాప్‌ ‌లాంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.

25 మార్చి 2020 నుండి 01 నవంబర్‌ 2020 ‌వరకు కొరోనా వ్యాప్తి మరియు కట్టడి చర్యల అన్వేషణాత్మక లోతైన అధ్యయనం చేసిన అరవింద్‌? ‌పాండే పరిశోధనా బృందం తమ ఫలితాలను 07 మే 2021 ‘జర్నల్‌ ఆఫ్‌ ‌సోసియో-ఎకనమిక్‌ ‌డెవలప్‌మెంట్‌’ ‌పరిశోధనా గ్రంథంలో ప్రచురించారు. ‘డిటర్మినెంట్స్ ఆఫ్‌ ‌కోవిడ్‌-19 ‌పాండమిక్‌ ఇన్‌ ఇం‌డియా : ఆన్‌ ఎక్సప్లొరేటరీ స్టడీ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌స్టేట్స్ అం‌డ్‌ ‌డిస్ట్రీక్టస్ (ఇం‌డియాలో కోవిడ్‌-19 ‌మహమ్మారి నిర్ణాయకాలు : ఇండియాలోకి రాష్ట్రాలు మరియు జిల్లాల్లో అన్వేషనాత్మక అధ్యయనం)’ అనబడే పరిశోధనా పత్రంలో భారతదేశ పలు రాష్ట్రాల మరియు జిల్లాల్లో కోవిడ్‌-19 ‌విపత్తును గూర్చి వివరించుట జరిగింది. కోవిడ్‌-19 ‌కల్లోలంలో ప్రజారోగ్య పరిస్థితులు (వైరస్‌ ‌వ్యాప్తి, కేసుల సంఖ్య, మరణాల రేటు, రికవరీ రేటు, పాజిటివ్‌ ‌రేటు లాంటి) మరియు వైద్య ఆరోగ్య మౌళిక వసతుల కల్పన (ఆసుపత్రులు, బెడ్స్, ఐసియూలు, కోవిడ్‌-19 ‌పరీక్షలు, వెంటిలేటర్లు, వైద్యులు లాంటి) అంశాలను క్రోడీకరించి వివిధ రాష్ట్రాలు మరియు జిల్లాల ఫలితాలను 3 నిర్ణాయక సూచికల ద్వారా వెల్లడించారు.

1. కోవిడ్‌-19 ‌పరిస్థితుల సూచిక (సిచుయేషన్‌ ఇం‌డెక్స్):
ఈ ‌విభాగంలో కొరోనా వ్యాప్తి రేటు, అక్టివ్‌ ‌కేసులు, మరణాల రేటు, రికవరీ రేటు మరియు పాజిటివిటీ రేటు (కొరోనా పరీక్షలు : నిర్థారించిన పాజిటివ్‌ ‌కేసులు) అనే ఐదు సూచికలను తీసుకున్నారు. అధిక కోవిడ్‌ -19 ‌తాకిడి ఉన్న 21 రాష్ట్రాలను ‘అతి తక్కువ (వెరీ పూర్‌)’, ‘‌తక్కువ (పూర్‌)’, ‘‌మధ్యస్థ (ఆవెరేజ్‌)’ ‌మరియు ‘ఉత్తమ (బెట్టర్‌)’ అనబడు గ్రూపులుగా వర్గీకరించారు. ఈ సూచికలో ‘ఉత్తమ (బెట్టర్‌)’ ‌ర్యాంకుల వర్గంలో తెలంగాణ, రాజస్థాన్‌, ‌బీహార్‌ ‌మరియు హర్యానా రాష్ట్రాలు పొందగా, ‘ఆవెరేజ్‌’ ‌వర్గంలో యూపీ, గుజరాత్‌, ‌జె అండ్‌ ‌కె, పంజాబ్‌, ‌యంపీ మరియు తమిళనాడు చోటు దక్కించుకున్నాయి. ‘పూర్‌‘ ‌వర్గంలో కర్నాటక, ఝార్ఖండ్‌, ఏపీ, ఒడిసా మరియు కేరళ ఉండగా, ‘వెరీ పూర్‌’ ‌వర్గంలో ఢిల్లీ, అస్సామ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌ఛత్తీస్‌గడ్‌ ‌మరియు మహారాష్ట్ర చివరి స్థానాలలో ఉన్నాయి. 01 నవంబర్‌ 2020 ‌నాటికి దేశంలో 11.07 కోట్ల కరోనా పరీక్షలు చేయగా, 8.23 లక్షల పాజిటివ్‌ ‌కేసులు మరియు పాజిటివిటీ రేటు 7.4గా నమోదు అయ్యింది. అదే రోజు తెలంగాణలో 43.24 లక్షల పరీక్షలు, 2.40 లక్షల పాజిటివ్‌ ‌కేసులు, 1341 మరణాలు మరియు పాజిటివిటీ 5.5గా రికార్డు అయ్యింది. మరో వైపు ఏపీలో 81.2 లక్షల పరీక్షలు, 8.26 పాజిటివ్‌ ‌కేసులు, 7.96 లక్షల రికవరీలు, 10.2 పాజిటివిటీ మరియు 6706 మరణాలు నమోదు అయ్యాయి.

2. వైద్య ఆరోగ్య మౌళిక వసతుల సూచిక (హెల్త్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇం‌డెక్స్):
మన దేశంలో ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపు చాలా తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జిడిపిలో 1.6 శాతం మాత్రమే కేటాయింపులు జరగడం అత్యంత విచారకరం. ఆరోగ్య పరిరక్షణకు నిధుల కేటాయింపు స్వల్పంగా జరిగిన కారణంగా ఊహించని కోవిడ్‌-19 ‌ప్రళయానికి దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నది. దేశంలో నవంబర్‌-2020 ‌నాటికి ప్రతి మిలియన్‌ ‌జనాభాకు సగటున 51 ఆసుపత్రులు, 1405 పడకలు, 70 ఐసియూ యూనిట్లు, 35 వెంటిలేటర్లు, 854 మంది డాక్టర్లు మరియు 2 కోవిడ్‌-19 ‌పరీక్షా కేంద్రాల వసతులు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ప్రతి మిలియన్‌ ‌జనాభాకు 109 ఆసుపత్రులు, 2662 పడకలు, 133 ఐసియూలు మరియు 67 వెంటిలేటర్లతో అన్ని రాష్ట్రాల కన్న ఉత్తమ వసతులను కలిగి ఉండడం హర్షదాయకం. ఆంధ్రలో ప్రతి మిలియన్‌ల జనాభాకు 18 ఆసుపత్రులు, 1582 పడకలు, 79 ఐసియూలు మరియు 40 వెంటిలేటర్ల వసతులు ఉన్నాయి. తెలంగాణలో వైద్య వసతులు జాతీయ సగటు కన్న చాలా ఉన్నత స్థితిలో ఉండడంతో ఇతర రాష్ట్రాల రోగులు కూడా తెలంగాణ ఆసుపత్రులను వెతుక్కుంటూ రావడం జరుగుతున్నది. వసతుల అంశాల్లో రాష్ట్రాల మధ్య భారీ అంతరాలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య వసతుల్లో అత్యుత్తమ (బెట్టర్‌) ‌వసతులతో కర్నాటక (1వ ర్యాంకు), కేరళ (2వ ర్యాంక్‌) ‌తెలంగాణ (3వ ర్యాంక్‌), ‌తమిళనాడు (4వ ర్యాంక్‌) ‌మరియు పంజాబ్‌ (5‌వ ర్యాంక్‌) అ‌గ్ర స్థానాల్లో ఉండగా, ‘ఆవరేజ్‌’ ‌వసతుల వర్గంలో ఢిల్లీ, ఏపీ, మహారాష్ట్ర, హర్యానా, యూపీ మరియు రాజస్థాన్‌లు ఉన్నాయి. ‘పూర్‌’ ‌వసతుల వర్గంలో పశ్చిమ బెంగాల్‌, ‌గుజరాత్‌, ‌జె అండ్‌ ‌కె, అస్సామ్‌ ‌మరియు ఒడిసా ఉండగా, ‘వెరీ పూర్‌’ ‌వసతులున్న వర్గంలో యంపీ, ఝార్ఖండ్‌,‌ఛత్తీస్‌గడ్‌ ‌మరియు బీహార్‌ ‌రాష్ట్రాలు చివరన ఉన్నాయి.

3. కోవిడ్‌-19 ‌పరిస్థితుల మరియు వైద్య ఆరోగ్య వసతుల సూచికలను కలుపుకొని ర్యాంకుల నిర్థారణ (మాట్కిక్స్ ఇం‌డెక్స్):
వివిధ రాష్ట్రాలలో కోవిడ్‌-19 ‌పరిస్థితులు మరియు అందుబాటులో ఉన్న వైద్య వసతులను కలుపుకొని దేశవ్యాప్తంగా ర్యాంకులను నిర్ణయించడం జరిగింది. దీనినే ర్యాంకింగ్‌ ‌మాట్రిక్స్ అని నామకరణం చేశారు. ఈ జాబితాలో 1వ ర్యాంకును తెలంగాణ దక్కించుకోగా 2వ స్థానంలో రాజస్థాన్‌, 3‌వ ర్యాంక్‌లో బీహార్‌, 4‌వ ర్యాంకులో హర్యానా రాష్ట్రాలు ‘బెట్టర్‌’ ‌వర్గంలో చోటు దక్కించుకున్నాయి. తరువాత ర్యాంకుల్లో వరుసగా యూపీ (5వ), గుజరాత్‌ (6‌వ), జె అండ్‌ ‌కె 7వ), పంజాబ్‌ 8‌వ), యంపీ (9వ) మరియు తమిళనాడు (10వ ర్యాంకు)లతో నిలిచి ‘ఆవరేజ్‌’ ‌వర్గంలో చోటు దక్కించుకున్నాయి. ‘పూర్‌’ ‌వర్గంలో కర్నాటక (11వ), ఝార్ఖండ్‌ (12‌వ), ఏపీకి (13వ), ఒడిసా (14వ) మరియు కేరళ (15వ ర్యాంకు) స్థానాలను దక్కించుకున్నాయి. జాబితా చివరలో ‘వెరీ పూర్‌’ ‌వర్గంలో ఢిల్లీ, అస్సామ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌ఛత్తీస్‌గడ్‌ ‌మరియు మహారాష్ట్రలు 16, 17 18, 19, 20 మరియు 21వ ర్యాంకులను వరుసగా పొందాయి.

జిల్లాల్లో కోవిడ్‌-19 ‌సాంఘీక నిర్ణాయకాలు (సోషియల్‌ ‌డిటర్మినాంట్స్ ఎమాంగ్‌ ‌డిస్ట్రిక్టస్):
జిల్లాల్లో కొరోనా విపత్తు ప్రభావాన్ని బట్టి జిల్లాలను ‘అతి ఎక్కువ (వెరీ హై)’, ‘ఎక్కువ (హై)’, ‘మధ్యస్థ (మాడరేట్లి హై)’, ‘తక్కువ (లో)’ మరియు ‘అతి తక్కువ (వెరీ లో)’ అనే ఐదు క్లస్టర్లుగా వర్గీకరించారు. అత్యధిక కోవిడ్‌-19 ‌గాఢతలు (వెరీ హై) కలిగిన ముంబాయ్‌, ‌బీజాపూర్‌, ‌చెన్నై, బెంగుళూరు, గుర్‌‌గ్రామ్‌, ‌నాగపూర్‌, ‌ఢిల్లీ మరియు కొల్‌కత్తా లాంటి 21 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మహారాష్ట్రలోని 04, ఏపీలోని 03, పాండుచ్ఛెరీలోని 03 జిల్లాలు కూడా 31 ఉన్నాయి. అధిక గాఢత కలిగిన వాటిలో ఏపీలోని 8, కేరళలోని 8, కర్నాటకలోని 5, మహారాష్ట్రలోని 4 జిల్లాలు ఉన్నాయి. ఫరీదాబాద్‌?, ‌శ్రీనగర్‌, ‌హైదరాబాద్‌?, ‌థానే, కోయంబత్తూర్‌, ‌మైసూర్‌ ‌లాంటి జిల్లాలు కూడా ఈ వర్గంలో ఉన్నాయి. మాడరేట్లీ హై కోవిడ్‌-19 ‌గాఢతగల వర్గంలో 107 జిల్లాలు ఉండగా, తక్కువ (లో) కోవిడ్‌-19 ‌గాఢత కలిగిన జిల్లాలు 165 మరియు అతి తక్కువ (వెరీ లో) కోవిడ్‌-19 ఉన్న జిల్లాలు 317 ఉన్నాయని విశ్లేషించారు. అత్యధిక, అధిక మరియు మాడరేట్‌ ‌గాఢతలు కలిగిన 159 జిల్లాల్లో 66 శాతం కేసులు బయట పడ్డాయి. తక్కువ మరియు అతి తక్కువ గాఢత కలిగిన 428 జిల్లాల్లో 34.33 శాతం కేసులు గమనించారు. అత్యధిక మరియు అధిక కేసులు కలిగిన జిల్లాల్లో అధిక జనసాంద్రత మరియు పారిశుద్ధ్య లోపంతో కేసులు విపరీతంగా పెరగడం జరిగిందని తేల్చారు.

ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రంతో పోల్చితే తెలంగాణలో కొరోనా పరీక్షలు విరివిగా చేయకపోవడం, కేసుల మరియు మరణాల రిపోర్టు తక్కువగా చూపించడం చేస్తున్నారనే వాదనలు చేసే వారు అనేకం ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణలో వైద్య వసతులు అధికంగా ఉండడంతో కేసుల రికవరీలు అధికంగా, మరణాల రేటు సహజంగానే తక్కువగా ఉందని అభిప్రాయ పడవచ్చు. కొరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాలు మరియు మహానగరాల్లో సాంఘీక నిర్ణాయకాలు జనసాంద్రత, కనీస వసతులు, నీటి లభ్యత, పారిశుద్ధ్యం, వలసదారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ప్రజలు లాంటి అంశాలు కొరోనా వ్యాప్తిని, కట్టడిని, మరణాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వాలు వెంటనే ఇలాంటి సమస్యలకు పరిష్కారాలను చూపుతూ, వైద్య వసతులను మహానగరాల నుండి గ్రామ పంచాయతీల వరకు సత్వరమే ఏర్పాటు చేసే కార్యాన్ని యజ్ఞంలా తీసుకోవాలి. నేటి రెండవ అలతో పాటు భవిష్యత్తులో అంచనా వేస్తున్న 3వ అలను కూడా దృష్టిలో పెట్టుకొని, సకల ఏర్పాట్లు, ముఖ్యంగా టీకా కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలు కోవిడ్‌-19 ‌పరిస్థితులను మదిలో ఉంచుకొని, వైద్య వసతులను పెంచుకుంటూ, కొరోనా కట్టడిలో ముందుండాలని కోరుకుందాం.

 

dr-burra-madhusudhan-reddy
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply