Take a fresh look at your lifestyle.

ఐసెట్‌-2020 ‌ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌పాపిరెడ్డి
ప్రజాతంత్ర, వరంగల్‌ :  ‌తెలంగాణ రాష్ట్ర ఐసెట్‌-2020 ‌ప్రవేశ పరీక్షల ఫలితాలను వరంగల్‌లో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌పాపిరెడ్డి సోమవారం వరంగల్‌లో విడుదల చేశారు. కొవిడ్‌-19 ‌నేపథ్యంలో రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశామని, వాస్తవానికి మేలోనే నిర్వహించాల్సి ఉందన్నారు. అనేక సమస్యలతోనే మూడోసారి ఐసెట్‌ ‌ప్రవేశ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మహమ్మారి సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వ్యయ ప్రయాసాలకోర్చి నిర్వహించి నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ, కామర్స్ ‌మేనేజ్‌మెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌కు, ఐసెట్‌ ‌బృందానికి ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తరఫున అభినందనలు
తెలిపారు.

ఈ ఏడాది ఐసెట్‌లో ప్రవేశానికి 58,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 45, 975 మంది పరీక్షకు హాజరైతే 41,506 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణత 90.28 శాతం నమోదైందని పేర్కొన్నారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థులు..
సెట్‌లో మొదటి ర్యాంకును హైదరాబాద్‌లోని ఎస్సానగర్‌కు చెందిన బి శ్రీభశ్రీ 159.5 మార్కులతో మొదటి ర్యాంకును సాధించినట్లు ప్రకటించారు. రెండో ర్యాంకు సందీప్‌ 144.50 (ఆర్మూర్‌, ‌నిజామాబాద్‌), ‌మూడో ర్యాంకు అవినాశ్‌ ‌సిన్హా 142.43 (హైదరాబాద్‌), ‌నాలుగు ర్యాంకు ప్రసన్న లక్ష్మి 142.45 (వరంగల్‌), ఐదో ర్యాంకు మదరవోని శ్రీకృష్ణ సాయి 141.40, (రంగారెడ్డి)ఆరో ర్యాంకు తిప్పర్తి అఖిల్‌రెడ్డి 140.933 (రంగారెడ్డి), ఏడో ర్యాంకు డి జయదీప్‌ 140.22 ( ‌వెస్ట్ ‌బెంగాల్‌), ఎనిమిదో ర్యాంకు పాటి అఖిల్‌రెడ్డి 139.11 ( నెల్లూరు ఆంధప్రదేశ్‌), ‌తొమ్మిదో ర్యాంకు వీఎస్‌ ‌రాజేఖర్‌రెడ్డి 136.50 (గుంటూరు- ఏపీ), పదో ర్యాంకు మహ్మద్‌ ‌సొహైల్‌ 135.86 (‌భద్రాద్ది కొత్తగూడెం) సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ‌వివరించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రా ‌పురుషోత్తం, ఐసెట్‌ ‌కన్వీనర్‌ ‌ప్రొఫెసర్‌ ‌రాజిరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply