Take a fresh look at your lifestyle.

హైకోర్టులో కొరోనా కలకలం.. 25 మందికి పాజిటివ్‌..!

‌యధావిధిగా కార్యకపాలాలు కొనసాగుతాయి : రిజిస్ట్రార్‌

‌కొరోనా ప్రభావం తెలంగాణ హైకోర్టునూ తాకింది. హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందికి నిర్వహించిన టెస్టులలో పాజిటిగా నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. మంగళవారం న్యాయస్థానంలో పనిచేసే 50 మంది సిబ్బందికి టెస్టులు నిర్వహించగా, వారిలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, బుధవారం మరో 15 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హైకోర్టు భవనంలో పూర్తిగా శానిటైజ్‌ ‌చేశారు. హైకోర్టులోని ఈ ఫైలింగ్‌ ‌విభాగాన్ని జ్యుడీషియల్‌ అకాడమీకి తరలించారు. గతంలో కూడా హైకోర్టులో పనిచేస్తున్న సిబ్బందితో పాటు కొందరు న్యాయవాదులకు కూడా కొరోనా సోకింది. దీంతో గురువారం నుంచి హైకోర్టును పూర్తి స్థాయిలో మూసివేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ ‌ఖండించారు. హైకోర్టు కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా కేసుల విచారణ జరుగుతున్నదనీ, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

error: Content is protected !!