Take a fresh look at your lifestyle.

కార్పొరేట్‌ ‌విద్యాసంస్థలకు.. కొమ్ముకాస్తున్న ప్రభుత్వం

ఆన్‌లైన్‌ ‌క్లాసులు విన్న అతితక్కువ పట్టణ విద్యార్థుల్లో పాఠ్యాంశం అర్ధం చేయించే ఉపాధ్యాయులెంత మంది. అర్ధంచేసుకున్నా విద్యార్థులెంత శాతంలో ఉన్నారో తెలీదు. మరి అందరికీ ఉచిత నిర్బంధ విద్య హామీపడ్డ ప్రభుత్వం అందరికి ఆన్‌లైన్‌ ‌విద్యానందించే ప్రయత్నాలు మాత్రం శూన్యం.అది ఇంకా తెగని పంచాయితీ లాగానే ఉంది.కానీ ప్రభుత్వం 10వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ ‌చేసి ఇంటర్‌ ‌లాంటి ఉన్నత చదువులకు పరీక్షలు వాయిదా వేసి వేసవి సెలవులిచ్చి గత విద్యాసంవత్సరంను ముగించేశారు.

దేశవ్యాప్తంగా కొరోనా రెండోవేవ్‌ ‌మనిషి జీవితాన్ని,మానవ సంబంధాలన్ని చిన్నాభిన్నం చేస్తోంది.ఆ ఉధృతికి జీవనోపాధి కరువై కొందరు, కార్పొరేట్‌ ‌వైద్యభారం మోయలేక మరికొందరు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ భయానక బీభత్స పరిస్థితుల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ చచ్చి బ్రతకలేక,బ్రతికి చావలేక బతుకీడ్చుకొస్తున్నా విపత్కర పరిస్థితుల్లో ఇంటర్‌ ‌బోర్డ్ ఉరుములు మెరుపులు లేకుండా మే 25 నుంచి అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చు అంటూ తెలియజేసింది.

ఇది ‘‘శవాలపై పేలాలులేరుకునే’’ శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల అనుకూల నిర్ణయం తప్పా విద్యార్థుల విద్యాభావితత్వం పై ఏ మాత్రమూ ప్రేమ,చిత్తశుద్ధి కాదు.. ఎందుకంటున్నానంటే కొరోనా కారణంగా మూతపడ్డ విద్యాసంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో నేడున్నాం.ఇక ప్రభుత్వం గత అకడమిక్‌ ఇయర్‌ ‌లో మొక్కుబడిగా నిర్వహించిన ఆన్లైన్‌ ‌క్లాసుల బోధన 75 యేళ్లగా అభివృద్ధి చెందుతూ..న్నా దేశంలో ఎంత శాతం గ్రామీణ విద్యార్థులను చేరిందో ఆలోచించాల్సిఉంది.

ఆన్లైన్‌ ‌క్లాసులు విన్న అతితక్కువ పట్టణ విద్యార్థుల్లో పాఠ్యాంశం అర్ధం చేయించే ఉపాధ్యాయులెంత మంది.అర్ధంచేసుకున్నా విద్యార్థులెంత శాతంలో ఉన్నారో తెలీదు.మరి అందరికీ ఉచిత నిర్బంధ విద్య హామీపడ్డ ప్రభుత్వం అందరికి ఆన్లైన్‌ ‌విద్యానందించే ప్రయత్నాలు మాత్రం శూన్యం.అది ఇంకా తెగని పంచాయితీ లాగానే ఉంది.కానీ ప్రభుత్వం 10వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ ‌చేసి ఇంటర్‌ ‌లాంటి ఉన్నత చదువులకు పరీక్షలు వాయిదా వేసి వేసవి సెలవులిచ్చి గత విద్యాసంవత్సరంను ముగించేశారు.

వాయిదావేసిన ఉన్నత చదువుల పరీక్షలు
ఇంకా తగ్గని కరోనా ఉధృతి దృష్ట్యా ఎప్పుడుంటాయో స్పష్టంగా తెలియజెయ్యలేదు.ఇదిఇలా ఉండగాఒకవైపు ఇంటర్‌ ‌ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల అనుమతి రెన్వెల్‌ ‌చెయ్యలేదు.కొత్తగా అనుమతికోసం అప్లై చేసుకున్నా కళాశాలలకు( జూన్‌ 30 ‌వరకు)తేదీ ముగించనూ లేదు.ఇప్పుడూ విద్యార్థులెలా ఏ ఏ కళాశాలల్లో అడ్మిషన్లు పొందాలంటే ఇంటర్‌ ‌బోర్డు ప్రకటించక ముందే అడ్మిషన్లు ప్రక్రియ కొనసాగిస్తున్నా కార్పొరేట్‌ ‌నారాయణ శ్రీ చైతన్య కళాశాలల్లోనే అంటూ చెప్పకనే చేస్తోంది..కొరోనా పాండమిక్‌ ‌టైంలో ట్యూషన్‌ ‌ఫిజు మాత్రమే చెల్లించమని స్పష్టమైన ప్రభుత్వ నిబంధనలున్నప్పటికి వాటిని తుంగలో తొక్కి మొత్తం ఫిజు కట్టాల్సిందేనంటూ కార్పొరేట్స్ ‌డిమాండ్‌ ‌చేసాయి. సుమారు రెండు సంవత్సరాలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు, విద్యార్థులు పట్ల కనీస మానవత్వంను చూపలేదు. నెల రోజుల కాలేజి కి మొత్తం ఎందుకు చెల్లించాలి అంటూ ప్రశ్నించిన తల్లిదండ్రులను టిసి తీసుకోమని బెదిరింపుతో కూడిన ఉచిత సలహా ఇచ్చారు.విద్యార్థులు చదువుకోవాలనే తల్లిదండ్రుల బలహీనతలను కాసులు చేసుకుంటున్నాయి..

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర కార్పొరేట్‌ ‌విద్యాసంస్థలను కృష్ణా నది అవతలికి తన్ని తరుముతమన్న కేసీఆర్‌.‌శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల వేధింపుల కారణంగా ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నా,పదే పదే ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఆప్‌ ‌లైన్‌ ,ఆన్లైన్‌ ‌క్లాసులు నడిపిస్తూ లక్షల్లో ఫిజులు వసూళ్లు చేస్తున్నా ‘‘నిమ్మకి నీరెత్తినట్లు ప్రవర్తిస్తుంది’’ పైగాగత అకడమిక్‌ ఇయర్‌ ‌లో ప్రభుత్వం కార్పొరేట్‌ ‌ఫిజుల వసూళ్ళకు అనుకూలంగా నెల రోజులు ఆఫ్‌ ‌లైన్‌ ‌తరగతులను ప్రారంభించారు .ఫలితంగా ప్రభుత్వం కోట్లల్లో ముడుపులు పొంది MLC ఎలక్షన్‌ ‌లో ఉపయోగిచుకున్నాయి. దేశంలో, ప్రపంచంలో కొరోనా కరాలనృత్యం కారణంగా విద్యారంగం,విద్యార్థుల భవితవ్యం ఎదుర్కొన్న సమస్యలపై యునెస్కో,ఎడ్యుకేషనల్‌ ఇం‌టర్నేషనల్‌ అం‌తర్జాతీయ సంస్థలు మేధావులు ఉపాద్యాయులు చర్చిస్తూ ప్రత్యామ్నాయలను మేదోమదనం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం శ్రీ చైతన్య, నారాయణ సహా ఇతర కార్పొరేట్‌ ‌కాలేజీలు అడ్మిషన్లు కై ఆరాట పడటం సిగ్గుచేటు.కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వ విధానాలు నశించాలి.విద్యార్థులను జలగలా పట్టి పీడిస్తున్న కార్పొరేట్‌ ‌కళాశాలను రద్దు చెయ్యాలి.విద్యను జాతీయకరణ చేయాలి.

– గడ్డం శ్యామ్‌, PDSU ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్‌ ‌రంగారెడ్డి, 9908415381

Leave a Reply