- అన్నదాత సంక్షేమానికి ఎంతైనా ఖర్చు
- గతంలో ఉచిత విద్యుత్ అని చెప్పి ఉత్త విద్యుత్ ఇచ్చారు
- రైతులకు మేలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమే
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుల సంక్షేమానికి ఎంత ఖ•ర్చైనా పెట్టడానికి వెనుకంజ వేయదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది, కొండాపూర్, సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వొచ్చాక మంచినీటి బాధ లేకుండా చేసిందని, గత ప్రభుత్వాలు పవర్ బిల్లులు ముక్కు పిండి వసూలు చేశాయని, విద్యుత్ మాత్రం ఇవ్వలేదన్నారు. ఉచిత విద్యుత్ అని చెప్పి ఉత్త విద్యుత్ ఇచ్చారన్నారు. ఆనాటి ప్రభుత్వాలు రైతు చనిపోతే రూపాయి ఇవ్వలేదని, తెలంగాణ ప్రభుత్వం రైతు చనిపోతే ఐదు లక్షల బీమా మొత్తం రైతు ఇంటికి పంపుతుందని వివరించారు.
రైతు బంధు కింద 733 కోట్లు ఒక్క సంగారెడ్డి జిల్లాకు ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఉచిత కరెంటు, రైతుకు పెట్టుబడి సాయం, రైతు బీమా, కల్యాణ లక్ష్మి ఇలా ఎన్నో అందిస్తుందని తెలిపారు. రై•తుకు వ్యవసాయ పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సీఎం యోచన చేస్తున్నారని, రైతుల బాగు కోసం సీఎం నిత్యం ఆలోచిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో సంవత్సరానికి రెండు కోట్ల ఎకరాలు సాగు అవుతోందని తెలిపారు. రైతులు సంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. 20 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల తోటల సాగు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కూరగాయలు, పండ్లతోటల సాగు లాభదాయకంగా వుంటుందని, రైతులు ఆ దిశగా ఆలోచించాలన్నారు. తెలంగాణ వొచ్చాక సంగారెడ్డిలో 200 కోట్ల రోడ్ల పనులు జరిగాయనారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2500 రైతు వేదికలను రూ.600 కోట్లతో నిర్మించామని, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సింహ భాగం ఖర్షుపెడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,500 కోట్లు రైతు బంధు ఇచ్చామని. రాబోయే ఉగాది తరువాత స్వంత జాగ వుంటే ఇల్లు కట్టిస్తామని తెలిపారు. కంది గ్రామానికి సీసి రోడ్ల నిర్మాణానికి 30 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చిద్రుప్ప గ్రామానికి సిసి రోడ్ల నిర్మాణం కొరకు 20 లక్షలు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదేవిధంగా చెరువులో నిర్మాణం తదితర మరమ్మతులను చేయాల్సిందిగా నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వొచ్చాక సంగారెడ్డి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని, రైతువేదికలు రైతులకు దిక్సూచి లాంటివన్నారు.
ఈ వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతుల కోసం ఏటా నలభై వేల కోట్లు ఖర్చు చేస్తుందని,రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలను రాయితీతో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఇతర ప్రజా ప్రతినిదులు, జిల్లా అధికారులు, రైతులు పాల్గొన్నారు.