- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సివిల్ ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ
- ఈ సంవత్సరం తెలంగాణలో 48.429 కిమీ నేషనల్ హైవేలు నిర్మించాం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
తెలంగాణలో ముఖ్యంగా వరంగల్, సిద్దిపేట, కొత్తగూడెం లేదా కాగజ్ నగర్లో కొత్త విమానాశ్రయాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రణాళికలు వేస్తున్నదా అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలను తెరవడానికి తెలంగాణ ప్రభుత్వం నుండి ఏవైనా ప్రతిపాదనలు వొచ్చాయా అని అడుగుతూ… ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న విమానాశ్రయాల వివరాలు కావాలి…అలాగే షెడ్యూల్ చేసిన విమానయాన సంస్థలకు మరియు చార్టర్డ్ విమానాలకు మాత్రమే ఉపయోగించే విమానాశ్రయాల వివరాలు కూడా కావాలని సివిల్ ఏవియేషన్ మంత్రాలయాన్ని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరగా…తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు ఎయిర్‌పోర్టులతో పాటు మరో ఆరు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు కేంద్రం సిద్ధం చేస్తున్నదని సివిల్ ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భదాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం మూడు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో మొత్తం మూడు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు వొచ్చిన ప్రతిపాదనలపై టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్‌ను ఎయిర్పోర్టస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) పూర్తిచేసిందని మంత్రి తెలిపారు. ఈ నివేదికను ఈ నెల 7వ తేదీన తెలంగాణ ప్రభుత్వానికి ఎఎఐ సమర్పించిందని ఈ ప్రతిపాదిత మూడు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్థల ఎంపిక అనుమతులను ఇప్పటివరకు కేంద్ర పౌర విమానయాన శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని మంత్రి చెప్పుకొచ్చారు.
ఈ సంవత్సరం తెలంగాణలో 48.429 కిమీ నేషనల్ హైవేలు నిర్మించాం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
2020-21 సంవత్సరంలో ఇప్పటి వరకు తెలంగాణలో 48.429 కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగినట్లు కేంద్రం తెలిపింది. టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 12 వేల కిలో మీటర్ల నేషనల్ హైవేలు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఇప్పటి వరకు 2,284 కిలో మీటర్ల పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. సంగారెడ్డి-నర్సాపూర్-తుప్రాన్-గెజ్వెల్ యాదగిరిగుట్ట-చౌటుప్పల్ విభాగం(ఎన్‌హెచ్-161ఏఏ) తో పాటు ప్రతిపాదిత హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ యొక్క ఉత్తర భాగం భరత్ మాలా పరియోజన ఫేజ్ వన్ కిందకు చేర్చబడిందని కేంద్రం తెలిపింది. ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ యొక్క ఉత్తర భాగాన్ని అభివృద్ధి చేయడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్(డిపిఆర్) మ్యానుఫ్యాక్చర్ కన్సల్టెన్సీకి జూలై 14, 2021 నాడు ఇవ్వటం జరిగింది. ప్రాజెక్ట్ పూర్తీ చేయటానికి 10 నెలల డెడ్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. డిపిఆర్ రిపోర్ట్ ఆధారంగా ప్రాజెక్టు వ్యయం అనగా పౌర వ్యయం మరియు ఇతర ఖర్చులు ఖరారు చేయబడతాయి.
మంత్రిత్వ శాఖలో జరిగిన జనవరి 29, 2019న జరిగిన సమావేశంలో, ప్రభుత్వ భూములను ఉచితంగా ఇవ్వడంతో పాటు భూసేకరణ ఖర్చులో 50% భరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. అలాగే యుటిలిటీస్ మరియు ఇతర నిర్మాణానికి పూర్వ కార్యకలాపాల బదిలీ ఖర్చు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించాలని కేంద్రం చెప్పింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. డిపిఆర్ పూర్తయిన తరువాత, తదుపరి అప్రైసల్ మరియు ఆమోదం..ఇతర ఖర్చు, అమలు విధానం మొదలైనవి ప్రాజెక్ట్ పూర్తయిన సమయంలో నిర్ణయించబడతాయని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణలో రింగ్ రోడ్ కోసం జరిగిన భూసేకరణ అంచనా వ్యయంతో పాటు దాని అనుసంధానం, అభివృద్ధి ఈ ప్రాజెక్ట్ కోసం స్వాధీనం చేసుకోవాలనుకున్న భూమి వివరాలు….ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రం ఆశించిన సహకారం అందినదా..లేదా, అలాగే తెలంగాణాలో రింగ్ రోడ్ పూర్తయ్యేది ఎప్పుడు అని కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకి రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ సమాధానం ఇచ్చారు.