Take a fresh look at your lifestyle.

విశ్వవిద్యాలయాల స్వతంత్రతను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వం కుట్ర ..!

  • యూజీసీ సెక్రటరీ, సీవీవో  కలిసిన  బండి సంజయ్ శాతవాహన వర్శిటీకి 12–బి హోదా కల్పించాలని విజ్ఞప్తి
  • ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ,డిసెంబర్ 10

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల స్వతంత్రతను దెబ్బతీసేలా రాష్ట్ర  ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్టేట్ బిజేపి చీఫ్, ఎంపీ బండి సంజయ్‌  ఆరోపించారు.  ప్రభుత్వ అనుమతి లేనిదే యూనివర్సిటీల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకూడదని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం ఇందులో భాగమేనన్నారు. యూనివిర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించచడం లేదన్నారు. దీనివల్ల భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో యూజీసీ సెక్రటరీ, సీవీవో ప్రొఫెసర్‌ రజ్నీష్‌ జైన్‌ తో సంజయ్‌  భేటి అయ్యారు.

కరీంనగర్‌ లోని శాతవాహన యూనివర్శిటీకి 12–బి హోదాను కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. శాతవాహన వర్శిటీకి 12(బి) హోదా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లుసెక్రటరీకి వివరించారు. యూనివర్సిటీకి కావాల్సిన నిధులు సమకూరడం లేదని ఆయన దఈష్టికి తీసుకెళ్లారు. అలాగే, మారిన నిబంధనలతో యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల వీలైనంత త్వరగా 12–బి హోదాను కల్పిస్తే శాతవాహన వర్సిటీలో నెలకొన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని వివరించారు. తన విజ్ఒప్తిపై  వర్శిటీకి 12–బి హోదా కల్పించేదిశలో ప్రత్యేకంగా కమిటీని నియమించడంపై సంజయ్, యూజీసీ సెక్రటరీకి ధన్యవాదాలు తెలిపారు.

అలాగే, వెంటనే సెక్రటరీ రికగ్నైజేషన్‌ కమిటీ ఛైర్మన్‌తో ఫోన్‌ లో మాట్లాడి, శాతవాహన వర్శిటీకి 12–బి హోదా ఇచ్చే విషయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారని సంజయ్ వెల్లడించారు. రికగ్నైజేషన్‌ కమిటీ నివేదిక అందిన వెంటనే శాతవాహన వర్శిటీకి 12–బి హోదా కల్పిస్తామని సెక్రటరీ హామి ఇచ్చారన్నారు. ఒకవేళ  యూనివర్శిటీలో ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే వాటిని సరిదిద్ధుకుని యూజీసీ గైడ్‌ లైన్స్‌ ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

 

Leave a Reply