Take a fresh look at your lifestyle.

ఢిల్లీ మర్కజ్‌ ‌ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

  • మతప్రార్థనలకు వెళ్లిన వారిని పట్టుకునేందుకు వేట
  • రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
  • లాక్‌డౌన్‌ ‌మరింత కఠినంగా అమలు చేసేందుకు రంగం సిద్దం

ఢిల్లీ మర్కజ్‌ ‌ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మృతుల సంఖ్య ఒక్కరోజే ఆరుకు పెరగడం… లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ నుంచి ఢిల్లీలో మతపరమైన సభలకు వెళొచ్చినవారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ నుంచి సుమారు 1030 మంది ఢిల్లీకి వెళ్లొచ్చినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చినవారంతా స్వచ్చంధంగా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఢిల్లీ మత సమావేశానికి వెళ్లిన వారిలో తెలుగు వారు సైతం చాలా ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్టాల్ల్రో కలకలం రేగింది. ఢిల్లీ వెళ్లివచ్చిన వారిలో ఆరుగురు మృతి చెందారు. ఎవరెవరు వెళ్లారో స్వయంగా లొంగిపోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. వీరిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు  రంగంలోకి దిగాయి.

 

వారు ఎవరిఎవరితో కలిసారో గుర్తించే పనిలో పడ్డారు. ఇకపోతే ఆదిలాబాద్‌  ‌జిల్లా నుంచి ఢిల్లీలో మత సమావేశాలకు వెళ్లినవారిలో.. ఇద్దరు సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. వెంటనే వారిని బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌ ‌సెంటర్‌కు తరలించారు. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 16మందిని గుర్తించిన అధికారులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు. హైదరాబాద్‌ ‌పాత బస్తీలో ఓ వృద్ధుడు మృతి చెందడం, మరో కుటుంబమంతా వైరస్‌ ‌బారిన పడడానికి మత ప్రార్థనలో పాల్గొనడమే కారణమైనట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఢిల్లీలో జరిగిన ఇస్తమా జమాయిత్‌లో పాల్గొని, వివిధ మార్గాల్లో ప్రార్థనలో పాల్గొన్న వారు ఈ నెల 17న వాయు, రైలు మార్గాల్లో స్వగృహాలకు చేరుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఆదివారం ఐదుగురిని, సోమవారం మిగతా 10 మందిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి క్వారంటైన్‌కు, ఇద్దరినీ సూర్యాపేటలోని ఐసోలేషన్‌కు తరలించారు. ఆయా కుటుంబ సభ్యులందరినీ •ంక్వారంటైన్‌లో ఉంచారు. వారిలో ఆలేరు నుంచి ఆరుగురు, యాదగిరిగుట్ట నుంచి ఐదుగురు, భువనగిరి పట్టణం నుంచి ఇద్దరు, రాజాపేట, అర్వపల్లి, మేళ్ల చెర్వు మండలాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు సమాచారం.

మత ప్రార్థనల్లో పాల్గొన్న 16 మందిలో ఎవరికీ కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు నిర్దారణ కాలేదని, ముందు జాగ్రత్త కోసమే క్వారంటైన్‌కు తరలించినట్టు, ఎవరూ ఆందోళనకు గురికావొద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ‌సాంబశివరావు, డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ‌ప్రాంతంలో గల మర్కజ్‌ ‌మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అక్కడకు మత ప్రార్థనలకు వెళ్లినవారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్ధనలకు 1030 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వారిలో హైదరాబాద్‌ ‌జీహెచ్‌ఎం‌సీ పరిధి నుంచి 603 మంది హాజరైనట్టు మంగళవారం వెల్లడించింది. నిజామాబాద్‌ 80, ‌నల్లగొండ 45, వరంగల్‌ అర్బన్‌ 38, ఆదిలాబాద్‌ 30,  ‌ఖమ్మం 27, నిర్మల్‌ 25, ‌సంగారెడ్డి 22 మంది మర్కజ్‌ ‌మసీదు ప్రార్థనల్లో పాల్గొన్నారని తెలిపింది. కాగా, ’ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ‌ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ ‌సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!