Take a fresh look at your lifestyle.

చరితకెక్కని ఉద్యమ స్ఫూర్తి … పాల్వంచ రాములు

(జూలై 17 తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పాల్వంచ రాములు వర్థంతి సందర్భంగా..ప్రత్యేక కథనం..)

తెలంగాణ విమోచనోద్యమానికి భీజాలు పడింది నల్లగొండ జిల్లాలోనే. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల పోరాట స్ఫూర్తితో ఎందరో సాయుధ పోరాట యోధులు నిరంకుశ నిజాంకు అతని అను చరులకు(రజాకార్లకు) వ్యతిరేకంగా వివిధ మార్గాలలో ఉద్యమాలు చేసారు. కొందరు యోధులు ఉద్యమ కారులలో పోరాట స్ఫూర్తిని రగిలించే క్రమంలో ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచి పోయారు. మరికొందరు నాయకత్వ మార్గదర్శనంలో భాగంగా ధీరత్వాన్ని ప్రదర్శి ంచి చరిత్రలో నిలిచారు. రావి నారాయణ రెడ్డి,ఆరుట్ల రామచంద్రారెడ్డి, బీంరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మ భిక్షం, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణ రావు., తదితరుల సారధ్యంలో పోరాటం చేసిన ఎందరో చరిత్ర మరచిన సాయుధ పోరాట యోధులు వెలుగులోకి రాలేదు. జీవిత చరమాంకంలో కూడా అనేక ఇబ్బందులతో దుర్భర జీవనం గడిపారు. అలాంటి వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్‌ ‌పురం గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కీ.శే. పాల్వంచ రాములు గారు ఒకరిగా చెప్పొచ్చు.

తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి ఉద్యమ గడ్డ.. నల్లగొండ జిల్లాలో ఉదయించి ఉద్యమమే ఊపిరిగా నడిచిన బిడ్డ.. కీ.శే. పాల్వంచ రాములు అలియాస్‌ ‘‘అజాం’’ రామ. వీరు 1916లో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్‌ ‌పురంలో జన్మించారు. పాల్వంచ నర్సయ్య- రామక్కలకు ఏకైక సంతానం పాల్వంచ రాములు . చిన్నప్పటినుండే రాములు స్వాతంత్య్రోద్యమం గురించి జరిగే ఉద్యమాలను ఆసక్తిగా గమనించేవారు. యుక్త వయస్సు వచ్చే సరికి రాములు ఆలోచనలన్నీ అతనిని ఉద్యమం వైపుకు మరల్చాయి. ఆ క్రమ ంలోనే అతని వివాహం 1945లో నందనం గ్రామానికి చెందిన కంఠే శ్వరం రామయ్య-నర్స మ్మల కుమార్తె రంగ మ్మతో జరిగింది. భారత దేశానికి స్వాత ంత్య్రం సిద్ధించిన 1947 నాటికి తెలంగాణకు మోక్షం లభించలేదు. దేశమంతా స్వాతంత్య్రం సిధ్ధించి ఆనం దోత్స వాలతో ఉన్న తరుణం. కానీ నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరం కుశ బాని సత్వంలో మగ్గి హింసా వలయం లో కునారిల్లారు. హైదరా బాదును పాలిస్తున్న ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా రజాకార్లను ఉసిగొల్పడంతో రజాకార్ల అరాచకాలు మితిమీ రిపోయాయి. దీంతో సాయుధ పోరాట ఉద్యమాలు, కవులు కళాకారుల స్ఫూర్తితో ఉధృతమయ్యాయి. అందులో భాగంగా ఉద్యమ బాట పట్టిన కీ.శే. పాల్వంచ రాములు అతని గ్రామ సహచరులతో సుమారు 60 మందిని ఏకం చేసి రావి నారాయణ రెడ్డి సమూహంలో చేరి రజాకార్లపై జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

1947 సెప్టెంబర్‌ 17 ‌నుంచి1948 సెప్టెంబర్‌ 17 ‌వరకు రావి నారాయణ రెడ్డి సుమారు 300 మందితో ఏర్పాటు చేసిన ‘‘రేపాల క్యాంప్‌’’ ‌లో తన అనుచరులతో చేరారు. క్యాంపు ఇంఛార్జి బీంరెడ్డి నర్సింహా రెడ్డి. ఈ క్యాంపులోని సభ్యులలో సూర్యాపేటకు చెందిన నూకల రాఘవ రెడ్డితో కలిసి పాల్వంచ రాములు అతని సహచరులు సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా అనేక సమూహాలు సాయుధ పోరాటంలో పాల్గొంటున్న క్రమంలో ఉద్యమ కారుల్ని, పోరాట యోధుల్ని అణచి వేసే ప్రక్రియకు పూనుకున్న నిజాం, రజాకార్లు పోలీసు బలగాలతో దాడులు చేసి చాలామందిని అరెస్ట్ ‌చేసి జైలుకు తరలించి చిత్రహింసలు పెట్టారు. నూకల రాఘవరెడ్డి గారితో పాటు మరికొందరు అరెస్ట్ ‌కాబడి 6 నెలల పాటు నల్గొండ జిల్లా జైలులో నరకం అనుభవించి ‘‘పోలీస్‌ ‌యాక్షన్‌’’ ‌సందర్భంగా విడుదల అయ్యారు. కానీ అంతకు ముందు నుంచే అంటే అక్టోబర్‌ 1947 ‌లోనే కల్లు కుండలు పగలగొట్టిన కేసు రాములు అతని సహచరులపై నమోదు కాబడి దొరకకుండా అండర్‌ ‌గ్రౌండ్‌ ‌లో ఉండడం వలన వారు దొరకలేదు. సంచులలో పెద్ద పెద్ద కంకర రాళ్ళు, కర్రలు, గన్స్ ‌తో పాల్వంచ రాములు,అతని సహ ఉద్యమకారులు 60 మంది వరకు టేకుల సోమారం, గోకారం సహా చుట్టు ప్రక్క గ్రామాలలో కల్లును బ్యాన్‌ ‌చేసి రజాకార్లు, వారికి సహకరించే వారికీ కల్లు దొరక కుండా కల్లు కుండలు పగల గొట్టి ప్రభుత్వానికి కూడా ఎక్సైజ్‌ ‌రాకుండా చేశారు.కాపర్తి పోలీస్‌ ‌స్టేషన్‌లోఅరెస్ట్‌వారెంట్‌ ‌జారీఅయి కొందరు అరెస్ట్ ఆయ్యి జైలుకు తరలించబడ్డారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ చేయబడి దొరకకుండా తప్పిం చుకొని పాల్వంచ రాములుతో పాటు చాలామంది
సెప్టెంబర్‌ 1948 ‘‘‌పోలీస్‌ ‌యాక్షన్‌’’ ‌వరకు అండర్‌ ‌గ్రౌండ్‌ ‌లోనే ఉండి రజాకార్లకు పట్టపగలు చుక్కలు చూపించారు. రజాకార్లు రాములు ఆచూకీ కోసం అతని భార్యా పిల్లలను సైతం ఇబ్బందులు పెట్టారు. అయినా బెదరక అతని సమాచారం చెప్పలేదు.

నిజాం సెప్టెంబర్‌ 17‌న భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌ ‌భారతదేశంలో అంతర్భాగం అయున తర్వాత ఉద్యమ ఖైదీలను సెప్టెంబర్‌18‌న విడుదల చేయడంతో అండర్‌ ‌గ్రౌండ్‌ ‌లో ఉన్న పాల్వంచ రాములు అతని సహచరులు జన జీవనంలోకి వచ్చారు. ఆ తర్వాత ఉద్యమ కారులను పెద్దగా గుర్తించిందీ లేదు. వారిని ఆదుకున్నదీ లేదు. ఏదో ఒక వృత్తి చేసుకొని కుటుంబ జీవనం గడిపారు.

స్వతహాగా కళాకారుడైన పాల్వంచ రాములు అజాం వృత్తి చేసుకుంటూ దానితో పాటు ప్రజలను చైతన్యం చేసే క్రమంలో తనకు వచ్చిన కళారూపాలను ప్రదర్శిస్తూ కుటుంబ పోషణ చేసుకునేవారు. ఉదయం కులవృత్తి చేస్తూనే రాత్రి వేళల్లో గ్రామ కచ్చీర్ల వద్ద తోలుబొమ్మలాటలు, సామాజిక, పౌరాణిక పాత్రలతో యక్షగానాలు ఊరూరా వేస్తూ ప్రజలను మైమరపించేవారు.

పాల్వంచ రాములు కలం నుంచి జాలువారిన ‘‘వేయి తలలు ఖండించిన అపూర్వ చింతామణి’’, ‘‘హనుమజ్జననం’’ ముద్రితమైన యక్షకానాలు ., ‘‘విరాట పర్వం-కీచక వధ’’, ‘‘వెంకటేశ్వర కళ్యాణం’’, ‘‘శ్రీ కేదారేశ్వర వ్రతం’’ లు అముద్రిత యక్షగానాలు . ఇంతే కాకుండా ‘‘నాయీ బ్రాహ్మణ జీవిత మాల’’, ‘‘రజక శ్రమ’’ • పద్య మాలలు అముద్రితాలుగా మిగిలిపోయునవి. తన జీవిత చరమాంకంలో కడు పేదరికాన్ని అనుభవించిన పాల్వంచ రాములు గారు తేది: 17-07-2007 న మరణించారు.

ఇంతటి ఘనకీర్తి కల్గిన తెలంగాణ సాయుధ పోరాట యోధుని ఘనతను మననం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మరెందరో తెలంగాణ జాతి మరచిన తెలంగాణ నైజాం స్వాతంత్య్ర సమర యోధుల చరితలను తెలంగాణ భావితరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా చరిత్రకారులు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంపై దృష్టి కేంద్రీకరించాలి. కీ.శే. పాల్వంచ రాములు గారి జీవితాన్ని పాఠశాల సాయిలో పాఠ్యాంశంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం పోరాట యోధులను గౌరవించాలని కోరుకుంటూ…

తెలంగాణ(నైజాం) స్వాతంత్య్ర సమర యోధులు కీ.శే. పాల్వంచ రాములుకు ..
ఘనమైన నివాళులు అర్పిస్తూ..!!

– పాల్వంచ హరికిషన్‌, 9502451780

Leave a Reply