Take a fresh look at your lifestyle.

అం‌దరి పోరాటంతోనే తెలంగాణ ఏర్పాటు

  • ఒక్కరి పోరాటంతో ఏర్పడలేదు
  • టీజేఎస్‌ అధ్యక్షుడు, ప్రొ।।  కోదండరామ్‌

సీఎం కేసీఆర్‌ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని.. తెలంగాణ సమాజం కోట్లాడితేనే రాష్ట్రం ఏర్పడిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం చెప్పుకొచ్చారు.ఒక వ్యక్తి వల్లే తెలంగాణ వచ్చిందని నమ్మించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. సమిష్టి పోరాటం చేయకుంటే తెలంగాణకు తీరని నష్టం జరుగుతోందన్నారు. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు ఆశయాలు నెరవేరటం లేదని ఆయన ఆరోపించారు. గుప్పెడు మంది ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడ్తున్నారు. తెలంగాణ జనసమితి కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డియాతో మాట్లాడిన ఆయన.. గుప్పెడు మంది సంపన్నుల ఆస్తులు మాత్రమే పెరుగుతున్నాయన్నారు.

కృష్ణా నీటిని కాపాడలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వముంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అందరికీ న్యాయం జరగట్లేదు. రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ చేయటంలో కేసీఆర్‌ ‌విఫలమయ్యారు. మంత్రులు, అధికారులు పోస్ట్ ‌మ్యాన్‌ ఉద్యోగులు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్దికి ప్రగతి భవన్‌ ఆటంకంగా మారింది. జయశంకర్‌ ‌సార్‌ ‌చెప్పినట్లు రాష్ట్ర వచ్చాక అభివృధ్ధి కోసం పోరాటం చేయాల్సిన సమయమెచ్చింది. నీళ్ళు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం ఉపయోగపడటంలేదని కోదండరాం చెప్పుకొచ్చారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!