Take a fresh look at your lifestyle.

అమాత్యులందరూ అక్కడ…  హరీష్ రావొక్కడు ప్రజల్లో..

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka - CEO - C Spaceహరీష్ రావు.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఓటమెరుగని నాయకుడు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండే ప్రజా ప్రతినిధి.మరీ. ..ముఖ్యంగా తన కుటుంబగా భావించే సిద్దిపేటలో ఉండటమంటే మరీ మరీ ఇష్టం ఆయనకు. తాజాగా… శనివారం కూడా హరీష్ రావు తనకు తన నియోజకవర్గ ప్రజలు అంటేనే ఇష్టమని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే… రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ హైదరాబాద్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు,ఆయన మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్లు కూడా బేగంపేట ఎయిర్ పోర్టుకెళ్లి రాష్టప్రతికి స్వాగతం పలికారు. కానీ, హరీష్ రావు మాత్రం శనివారం రోజంతా సిద్దిపేట నియోజకవర్గ ప్రజల మధ్యే గడిపారు. ప్రారంభోత్సవాలు,శంఖుస్థాపనలతో బిజీగా గడిపారు. ప్రజలతో సెల్ఫీలు దిగారు. అమాత్యులందరూ హైదరాబాద్ లో ఉండగా….జన నేత హరీష్ రావు మాత్రం జనంతో ఉండి… తనకు తన ప్రజల కంటే ఏదీ ముఖ్యము కాదనీ రుజువు చేశారు. ఏది ఏమైనా హరీష్ రావు జనం నేత అని మరోసారి నిరూపించారు. హాట్సాప్ హరీష్ రావు అని జనం మాట్లాడుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply