Take a fresh look at your lifestyle.

‘పుర’సమరం సమాప్తం

  • ఉ‌ద్రిక్తతలు, ఘర్షణలు, వాదోపవాదాలు
  • 120 మునిసిపాలిటీల్లో, 8 కార్పొరేషన్‌లలో
  • బ్యాలెట్‌ ‌బ్యాలెట్‌ ‌బాక్సులో  అభ్యర్థుల భవిష్యత్తు నిక్షిప్తం
  • అత్యధికంగా ఆదిభట్లలో  90.27శాతం పోలింగ్‌

ఉ‌ద్రిక్తతలు, ఘర్షణలు, వాదోపవాదాలతో బుధవారం మునిసిపల్‌ ఎన్నికలు ముగిసాయి.పలుచోట్ల తోపులాటలు జరిగాయి.సీనియర్‌ ‌నాయకులు క్షేత్రస్థాయిలోకి వచ్చి సర్థిచెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో పెనుగులాటలు జరిగాయి. 1 మునిసిపాలిటీలు కార్పొరేషన్‌లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.మధాహ్నం  ఒంటిగంటవరకు మందకొడిగా ఉన్న పోలింగ్‌ ఒక్కసారే పుంజుకుంది. ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌, ‌నల్లగొండ జిల్లాల్లో ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. నిజామాబాద్‌, ‌హుజూర్‌నగర్‌, ‌జగిత్యాల ప్రాంతాల్లో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌కాంగ్రెస్‌ ‌బీజేపీల మధ్య  రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పోలింగ్‌ ‌స్టేషన్‌ల ముందే డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వచ్చాయి. హుజూర్‌నగర్‌లోడబ్బులు పంచుతున్న టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను కాం•గ్రెస్‌ ‌కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు.120 మునిసిపాలిటీల్లో, 9 కార్పొరేషన్‌లలో పోలింగ్‌ ‌బుధవారం సాయంత్రం ముగిసింది.రామగుండం, బడంగ్‌పేట్‌, ‌మీర్‌పేట్‌ ‌బండ్ల గూడ జాగీర్‌, ‌బోడుప్పల్‌, ‌ఫీర్జాదిగూడ,  జవహర్‌నగర్‌, ‌నిజామ్‌పేట్‌, ‌నిజమాబాద్‌ ‌కార్పొరేషన్లలో ఎన్నికలు ముగిసాయి.24న కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగనున్నాయి.ఈ ఎన్నికల్లో ప్రతి పోలీంగ్‌ ‌స్టేషన్లో 800 వోటర్లు వోటు హక్కుఉ ఉపయోగించుకునే విధంగా  ఏర్పాట్లుచేసినందున వేగంగా వోటు హక్కు వినియోగించుకోగలిగారు.ఈ క్రమంలో అత్యధికంగా ఆదిభట్ల మునిసిపాలిటీలో 90.27శాతం పోలింగ్‌ ‌నమోదైంది. నిజామాబాద్‌, ‌నల్లగొండ, కరీంనగర్‌ ‌పోలింగ్‌ ‌కేంద్రాల్లో సాయంత్రం 6.30 నిముషాల వరకు క్యూలైన్లలో ఓటర్లు నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం నుంచి పలు మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్‌లలో  ఒకేసారి 70నుంచి 80శాతం పోలింగ్‌ ‌పెరగడం గమనించాల్సిన అంశం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మునిసిపాలిటీల్లో 90 మునిసిపాలిటీలు టీఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుంటుందని ప్రకటించడం చర్చనీయాంశమైంది.120 మునిసిపాలిటీల్లో 6188 పోలింగ్‌ ‌కేంద్రాలు, 9కార్పొరేషన్‌లలో 1773పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచే పోలింగ్‌ ‌ప్రారంభమైంది. వేములవాడలో  ఒక పోలింగ్‌ ‌కేంద్రంలో మంగళతోరణాలు కట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌ ‌మునిసిపాలిటీ లో వేగంగా 81 శాతం వరకు పోలింగ్‌ ‌జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. సాయంత్రం 6 గంటలతర్వాత కూడా క్యూలైన్లలో ప్రజలు నిలబడి ఓట్లు వేశారు.  కార్పొరేషన్‌లలో 322 డివిజన్లలో, మునిసిపాలిటీల్లో 2647 వార్డుల్లో పోటీచేసిన అభ్యర్థుల  భవితవ్యం బ్యాలెట్‌బాక్సులోకి చేరిపోయింది. కొంపల్లి మునిసిపాలిటీల్లోని 10 వార్డులో ప్రయోగాత్మకంగా ఉపయోగించిన ఫేస్‌రికగ్నేషన్‌ ‌విధానానికి యువ వోటర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఎంఐఎం ఈ విధానాన్ని వ్యతిరేకించింది. మునిసిపాలిటీల్లో 40లక్షల ఓటర్లు బుధవారం జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న 25వేల సిబ్బంది ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినందుకు ఊపిరి పీల్చుకున్నారు.  కొన్ని కార్పొరేషన్‌లలో 5గంటల 30 నిముషాల వరకు ఓటర్లు క్యూలైన్లలో ఉండటంతోఅప్పటివరకు పోలింగ్‌ ‌నిర్వహించారు.2355 పోలింగ్‌ ‌కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెవెబ్‌కాస్టింగ్‌ ‌విధానానికి అనూహ్య స్పందన లభించింది. జిల్లాల కలెక్టర్‌లు ,రాష్ట్ర ఎన్నికల అధికారులు వెబ్‌కాస్టింగ్‌ను పర్యవేక్షించారు.  మంత్రులు, శాసనసభ్యులు, జిల్లాపరిషత్తు చైర్మన్‌లు, మండలపరిషత్తు చైర్మన్‌లు, వివిధ జిల్లాల అధికారులు తమ ఓటుహక్కును వినియోగిం చుకున్నారు. వేములవాడ 13వ వార్డులో  పోలింగ్‌బూత్‌ ‌ముందు స్వాగతతోరణాలను ఏర్పాటు చేశారు.. ఓటు వేసి వచ్చిన వారికి స్వీట్లు బ ఓటువేసినవారికి స్వీట్లు పంచారు.నారాయణఖేడ్‌లో  టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పోలింగ్‌బూత్‌ ‌సమీపంలో డబ్బులు పంచుతున్నట్లు ఆరోపణలు రావడంతో అరెస్టు చేశారు. నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌లో ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కాగా రామగుండం, నిజామాబాద్‌,‌బడంగ్‌పేట్‌,‌మీర్‌పేట్‌,‌బండ్లగూడా, నిజాంపేట్‌,, ‌ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ‌తదితర కార్పొరేషన్‌లో ఎన్నికలు జరిగాయి.మునిసిపాలిటీల్లో  9 కార్పొరేషన్‌ల్లో   53లక్షల 36వేల 605 మంది ఓటర్లు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 26లక్షల 71వేల 694 మంది పురుషులు, 26లక్షల64వేల 557 మంది స్త్రీలు.

మంతమంతుమమంత్రులు, ఎంఎల్‌ఏలు
సూర్యాపేట మునిసిపాలిటీలో మంత్రి  జి.జగదీశ్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించు కున్నారు.వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తిలో, మహబూ
బ్‌నగర్‌లో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌,ఇర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంఎల్‌ఏ ‌దివాకర్‌రావు, పరిగిఎంఎల్‌ఏ ‌మహేశ్‌రెడ్డి, హాలియాలో ఎంఎల్‌ఏ ‌నోముల నరసింహయ్య, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎంఎల్‌సీ జీవన్‌రెడ్డి  తదితరులు తమ ఓటు హక్కును ఆయా మునిసిపాలిటీల్లో వినియోగించుకున్నారు. ఆదిలాబాద్‌లో 142 పోలింగ్‌ ‌కేంద్రంలో కలెక్టర్‌ ‌దివ్య,సంగారెడ్డిలో కలెక్టర్‌ ‌హనుమంతరావు, నిజామాబాద్‌లో జాయింట్‌కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, అదేవిధంగా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు షబ్బీర్‌అలీ ఓటుహక్కు  ఉపయోగించుకున్నారు. ఎంపీ అర్వింద్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట, జగిత్యాల  మంచిర్యాల 5వ వారు• సూర్యాపేటలో దొంగోట్లు వేసేందుకు వచ్చిన వారిని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

వవర్థన్నపేట,తొర్రూర్‌, ‌మహబూబాబాద్‌, ‌భూపాలపల్లి, హాలియా,చిట్యాల, బోధన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముక్కును కాంగ్రెస్‌ అభ్యర్థి కొరికారు. మేడ్చల్‌ ‌జిల్లా 5వవార్డు పోలింగ్‌లో జగిత్యాలలో, నిజామాబాద్‌లో, సంగారెడ్డిలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తలకు, పోలీసులకు వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు అప్పటికప్పుడు ధర్నాలకు దిగారు. మేడ్చల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పై  దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగిత్యాలలో ఎంఎల్‌సీ జీవన్‌రెడ్డి పోలీస్‌ అధికారులను తీవ్రంగా మందలించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌డ్డి, ఎంఎల్‌ఏ ‌సంపత్‌కుమార్‌, ‌షబ్బీర్‌అలీ తదితర సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులతో ఘర్షణపడాల్సి వచ్చింది. వారికి అనేకవిధాలుగా నచ్చచెప్పారు.

 

కాగా  120 మునిసిపాలిటీ, 9 కార్పరేషన్‌ల ఎన్నికలను టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి, ఈ సారి  డబ్బులు పంచుతున్న టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను పట్టుకొని పోలీసులకు అప్పగించడంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు  చొరవ చూపారు. టీఆర్‌ఎస్‌ ‌రాష్ట్రంలోని జరిగిన అభివృద్ధిని కాలేశ్వరం ప్రాజెక్ట్‌ద్వారా ఉత్తరతెలంగాణ సస్యశ్యామలమవుతున్న పరిస్థితులను వివరించి ఇంటింటికి ప్రచారం చేసింది. అభివృద్ధి చేసినట్లుయితే డబ్బులు పంచాల్సిన అవసరం ఎందుకు వస్తున్నదని కాంగ్రెస్‌ ‌ప్రశ్నిస్తున్నది. కాంగ్రెస్‌ ‌ప్రధానంగా టీఆర్‌ఎస్‌లోకి చేరిన 12 మంది కాంగ్రెస్‌ ‌పార్టీ శాసనసభ్యుల పరిధిలోని మునిసిపాలిటీలపైన ఎక్కువగా ప్రచారాన్ని కేంద్రీకృతం చేసింది. టీఆర్‌ఎస్‌ ‌తరపున మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్తు చైర్మన్‌లు ప్రచారం చేశారు.ఈ ఎన్నికల్లో చాలా మంది మంత్రుల భవిష్యత్తు  ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా ప్రారంభమైంది. ధనప్రవాహం, దొంగోట్లు, ఓట్లగల్లంతు వంటి అంశాలపైన స్వచ్చందసంస్థలు చర్చలను ఆహ్వానిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.