Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఎంసెట్‌ ‌ఫలితాలు విడుదల

ఇంజనీరింగ్‌లో 75.29 శాతం ఉత్తీర్ణత
8న కొరోనాతో హాజరు కాని విద్యార్థులకు పరీక్ష
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

‌తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్‌ 2020 ‌పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌ ఇం‌జనీరింగ్‌ ‌పరీక్షకు మొత్తం 1,19,183 మంది విద్యార్థులు హాజరు కాగా, 75.29 శాతంతో 89, 734 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు.

ఎంసెట్‌ ఇం‌జనీరింగ్‌లో తొలి 10 ర్యాంకర్లు వీరే :

1.సాయితేజ వారణాసి, 2. కె.యశ్వంత్‌ ‌సాయి. 3. టి.మణివెంకట కృష్ణ, 4. కౌశల్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, 5. హార్తిక్‌ ‌రాజ్‌పాల్‌, 6. ‌నాగెల్లి నితిన్‌సాయి 7. ఈడిఎన్‌విఎస్‌ ‌కృష్ణ కమల్‌, 8. ఎ.‌సాయి వర్ధన్‌, 9. ‌సాయి పవన్‌, 10. ‌వచన్‌ ‌సిద్ధార్థ్. ‌కాగా, కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో మొత్తం నాలుగు రోజుల పాటు ఆన్‌లైన్‌ ‌ద్వారా అధికారులు ఈ పరీక్షలను నిర్వహించారు. ఇందుకోసం మొత్తం 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 79 తెలంగాణలో, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. కొరోనా వల్ల హాజరు కాని విద్యార్థులకు ఈనెల 8న మరోమారు పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి సబిత వెల్లడించారు.

Leave a Reply