రాష్ట్రంలో ఎంట్రెన్స్ టెస్టుల రీషెడ్యూల్ : ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి వెల్లడి
తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువును మరోమారు పెంచారు. గడువు పెంచినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. జూన్ 24 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది దరఖాస్తు చేసుకున్నారని గోవర్ధన్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఓసారి గడువు పెంచారు. తాజాగా మరోసారి గడువు పెంచడంతో మరింత మంది విద్యార్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ విద్యాశాఖ సెట్ పరీక్షలు నిర్వహించేందుకు నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది.
రాష్ట్రంలో ఎంట్రెన్స్ టెస్టుల రీషెడ్యూల్ : ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి వెల్లడి
రాష్ట్రంలో జూలై 5 నుండి 9 వరకు జరగాల్సిన మూడు ఎంట్రెన్స్ టెస్ట్‌లు రీషెడ్యూల్ చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి వెల్లడించారు. ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వ అనుమతి రాగానే తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మొత్తం ఏడు సెట్స్‌లో 3 సెట్స్ తేదీల్లో మార్పు ఉంటుందని, మిగిలిన నాలుగు సెట్స్ పరీక్షలు యథాతథంగా ఉండే అవకాశం ఉందని ఆయన వివరించారు. అన్ని ఎంట్రన్ టెస్టుల ఫలితాలు ఆగస్టు చివరి వారంలోపు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని.. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి అడ్మిషన్స్ పూర్తి చేసేందుకు అనువుగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు.
సెట్స్‌తో పాటుపాటు డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ తేదీలు కూడా మార్పు ఉంటుందని, డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు కామన్ పాలసీని అమల్లోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ విద్యా విధానంలోనే తరగతుల నిర్వహణ కొనసాగుతుందని, పరిస్థితులు కుదుటపడ్డాక ప్రత్యక్ష తరగతులపై ఆలోచిస్తామన్నారు.