ఫలితాలు విడుదల
అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం
తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో 15 జోన్లు, ఏపీలో 6 జోన్లలో పరీక్ష నిర్వహించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 1,10544 మంది పరీక్ష రాయగా.. 91,935 మంది విద్యార్థులు (86 శాతం) ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,53,890 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారని.. ఏపీ నుంచి 51,461 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మొత్తం పరీక్ష రాసిన వారిలో 1,56,879 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం ఉత్తీర్ణులు కాగా, 82 శాతం మంది అమ్మాయిలు పాసయ్యారని తెలిపారు.
అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా.. అమ్మాయిలు 87 శాతం మంది పాసైనట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ మొదటి ర్యాంకు అనిరుధ్, రెండో ర్యాంకు వెంకట మణిందర్‌రెడ్డి సాధించారని తెలిపారు. టీఎస్ ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీలో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. అడ్మిషన్ పక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదలచేస్తామని మంత్రి చెప్పారు. ఎంసెట్ పరీక్షలను ఈ నెల 10 నుంచి 14 వరకు నిర్వహించారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు 94.11 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.