Take a fresh look at your lifestyle.

ఎస్సీ సంక్షేమంలో తెలంగాణ దళితబంధు మకుటాయమానం

  • ప్రతి కుటుంబానికి గ్రాంటుగా 10 లక్షల రూ.ల సహాయం
  • ఇంతవరకు 31 వేల మంది లబ్దిదారులకు ప్రయోజనం
  • మరో 2.82 లక్షల కుటుంబాలకు కలుగనున్న ప్రయోజనం

బ్యాంకు లింకేజీ లేకుండా…… వంద శాతం గ్రాంటుగా ప్రతి అర్హత కల కుటుంబానికి 10 లక్షల రూ.ల సహయాన్ని అందించే పథకాన్ని ఊహించగలమా……….. ఊహించడం కాదు. సాధ్యమని నిరూపణ అయింది. అది ఎక్కడో కాదు మన తెలంగాణలోనే. ప్రభుత్వాలు దశబ్దాలుగా సాంప్రదాయక పథకాలు అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. కానీ వినూత్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు మానస పత్రికగా రూపుదిద్దుకున్న అత్యంత అద్భుతమైన పథకం తెలంగాణ దళిత బంధు. 2021-22 లోఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం క్రింద లబ్దిదారుని బ్యాంకు అకౌంటుకు నేరుగా సహాయాన్ని జమ చేస్తారు. దళిత బంధు రక్షణ నిధిని ఏర్పాటు చేసి, ఆపద సమయంలో ఆదుకొనేందుకు ఈ పథకాన్ని బలోపేతం చేయటం జరిగింది. అందులో భాగంగా దళిత బంధు లబ్దిదారుడు 10 వేల రూ.లు, మరో 10 వేల రూ.లను ప్రభుత్వం తన వాటాగా ఈ నిధికి సమకూర్చుతోంది.

కరీంనగర్‌ ‌జిల్లాలోని హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జూలై, 2021 లో సాచురేషన్‌ ‌మోడ్‌ ‌లో పైలట్‌ ‌ప్రాజెక్టుగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూ. లసహాయం అందించారు. ఫలితంగా అనేక స్వయం ఉపాధి మార్గాలను దళితులు ఎంచుకొని ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. జీవనోపాధిని కల్పించుకున్నారు. 15 వేల 402 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలిగింది. చాలా మంది లబ్దిదారులు క్యాబ్‌ ‌లు నడిపేందుకు కార్లు కొనుగోలు చేశారు. కొందరు ట్రాక్టర్లు, మందుల షాపులు, ఎరువుల దుకాణాలు నెలకొల్పు కొన్నారు. మరికొందరు పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇంకొందరు ఆదాయం వచ్చే వృత్తులను ఎంచుకొని, ప్రారంభి ంచారు. అనంతరం యాదాద్రి – భువనగిరి జిల్లాలోని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కల వాసాలమర్రి గ్రామా పంచాయితీలో ఆగస్టు, 2021 లో అమలు చేశారు. 75 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలిగించాలని సహాయం మంజూరు చేశారు.

ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌ ‌కర్నూలు, కామారెడ్డి జిల్లాల్లోని ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు వరుసగా మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్‌ ‌లోని ఒక్కొక్క గ్రామంలో తొలుత అమలు చేయాలని సెప్టెంబర్‌, 2021 ‌లో ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మధిరలోని చింతకాని మండలంలో అమలుకు వంద కోట్ల రూ.లు, తిరుమలగిరి మండలం కొరకు 50 కోట్ల రూ.లు, చారగొండ మండలం కొరకు 50 కోట్ల రూ.లు, నిజాంసాగర్‌ ‌మండలం కొరకు 50 కోట్ల రూ.లు ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ ‌ల అకౌంటుకు బదిలీ చేసింది.ఈ మండలాలలోని లబ్దిదారులఅకౌంట్లకు సహాయం విడుదల చేశారు. వీరిలో 4 వేల 808 మంది లబ్దిదారులకు మంజూరు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దళితబంధును రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 100 కుటుంబాల చొప్పున, ఆ విధంగా 11800 మంది కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇందులో ఇంతవరకు 10 వేల 803 మంది లబ్దిదారులకు సహాయం మంజూరు చేశారు. 2021-22 లో మొత్తం 31 వేల మంది లబ్దిదారులకు 10 లక్షల రూ. ల చొప్పున సహాయం మంజూరు చేశారు. అందుకుగాను 4 వేల 441 కోట్ల రూ.ల ప్రొవిజన్‌ ‌ను ప్రభుత్వం కల్పించింది. ఇందులో 3 వేల 100 కోట్ల రూ.లను జిల్లాలకు ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 2022-23 లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1500 యూనిట్ల ద్వారా దళిత కుటుంబాలకు 17 వేల 700 కోట్ల రూ.లను ప్రభుత్వం కేటాయించింది.అంటే 2 లక్షల 82 వేల మంది లబ్దిదారులకు ప్రయోజనం కల్పించనుంది.

రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని అలాగే విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ ‌రావు కార్యాచరణ రూపొందించారు. ఈ పథకం తో దళితుల జీవితాలలో సరి కొత్త మార్పులు సంభవించి ఆర్ధికంగా నిలదొక్కుకోగలరని, సామాజిక అభ్యుదయం సాధించగలరని ఆశించవచ్చును. దళితుల సంక్షేమంలో తెలంగాణ దళిత బంధు మకుటాయమానంగా నిలుస్తోందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Leave a Reply