Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొరోనా అదుపులో ఉంది

  • మూడవ విడత వాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నాం
  • కేంద్ర కాబినెట్‌ ‌కార్యదర్శి గౌబాతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎస్‌ ‌సోమేష్‌

‌కేంద్ర కేబినేట్‌ ‌కార్యదర్శి డా.రాజీవ్‌ ‌గౌబా, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. కోవిడ్‌ ‌కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటెయిన్‌మెంట్‌, ‌పర్యవేక్షణ, పెద్ద స్ధాయిలో వ్యాక్సినేషన్‌ ‌తదితర చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ కొరోనా రాష్ట్రంలో పూర్తి స్ధాయిలో అదుపులో ఉందని కేంద్ర క్యాబినేట్‌ ‌సెక్రటరీకి తెలిపారు.

రాష్ట్రంలో పాజిటీవ్‌ ‌రేటు 0.43శాతం ఉందని ప్రతి రోజు 200 లోపు కేసులు నమోదు అవుతున్నాయని, ఇది చాలా తక్కువ అని అన్నారు. రాష్ట్రంలో 1100 లోకేషన్లలో ర్యాపిడ్‌ ఆం‌టిజెన్‌ ‌పరీక్షలు నిర్వహించడం వలన రాష్ట్రంలో కేసుల సంఖ్యను, కొరోనాని నియంత్రించడం సాధ్యమైందని, ఎవరికైనా పాజిటీవ్‌ ‌వొస్తే వెంటనే మెడిసిన్‌ ‌కిట్స్‌ను అందిస్తున్నామన్నారు.

cs somesh kumar

వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌కు సంబంధించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం మంది హెల్త్ ‌వర్కర్స్, ‌ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వర్కర్స్‌కు వ్యాక్సినేషన్‌ ఇచ్చామని, వొచ్చేనెల 1 తేదిన ప్రారంభమయ్యే మూడవ విడత వ్యాక్సినేషన్‌ ‌సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం ‌రిజ్వీ, ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్‌ ‌రావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌ ‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply