Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌భవన్‌ ఉ‌ద్రిక్తం

  • ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ నేతలు

పెగాసస్‌ ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌కు నిరసనగా కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌ ‌భవన్‌ ఉ‌ద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ ‌నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాజ్‌భవన్‌ ‌ముట్టడికి వొచ్చిన కాంగ్రెస్‌ ‌నేతలను పోలీసులు అరెస్ట్ ‌చేసారు. విడతల వారిగా కాంగ్రెస్‌ ‌నేతలు రాజ్‌ ‌భవన్‌ ‌ముట్టడికి వొచ్చారు. దీంతో ఎప్పటికప్పుడు ముట్టడికి వొస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్షంలోనూ పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతకుముందు ఇందిరాపార్క్ ‌వద్ద నేతలు నిరసన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ ‌దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ దేశంలో నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపించారు. ప్రశ్నిస్తే 124ఏ సెక్షన్‌ ‌కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్లను హ్యాక్‌ ‌చేస్తోందంటూ వొస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలు ఇందిరా పార్కు నిరసనకు దిగారు. ఏఐసీసీ పిలుపుతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫోన్‌ ‌హ్యాకింగ్‌ ‌వ్యవహారంలో ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ ‌సాప్ట్‌వేర్‌ను ఎవరు కొనుగోలు చేశారో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ పోలీస్‌ ‌నిఘా విభాగం కూడా తమ ఫోన్లను ట్యాప్‌ ‌చేసిందని రాజనర్సింహ ఆరోపించారు. ఫోన్‌ ‌హ్యాకింగ్‌ ‌మన దేశం చేస్తుందా? శత్రుదేశం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఐటీ, ప్రైవసీ చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయని..దీనిపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్యే సీతక్క, సీనియర్‌ ‌నేతలు మల్లు రవి, ఫిరోజ్‌ఖాన్‌, ‌డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇందిరాపార్క్ ‌వద్దకు చేరుకున్న జగ్గారెడ్డి వి•డియాతో మాట్లాడుతూ సోనియా, రాహుల్‌ ‌ఫోన్లను ట్యాప్‌ ‌చేస్తూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు.

తెలంగాణలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్‌లను ట్యాప్‌ ‌చేస్తోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయన్నారు. నిరసన తెలపకుండా అడ్డుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓపిక నశిస్తే చెప్పకుండానే రాజ్‌భవన్‌ ‌ముట్టడిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ ‌నేతల చలో రాజ్‌భవన్‌ ‌పిలుపు నేపథ్యంలో రాజ్‌భవన్‌ ‌పరిసరరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇందిర పార్క్ ‌నుండి రాజ్‌ ‌భవన్‌ ‌ముట్టడికి కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది. దీంతో ఇందిరా పార్క్, ‌రాజ్‌ ‌భవన్‌ ‌పరిసర ప్రాంతాలలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్‌ ‌భవన్‌ ‌పరిసరాలలో 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ ఆం‌దోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్‌ ‌వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply