Take a fresh look at your lifestyle.

వరద బాధితులను ఆదుకోండి ..!

*వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు సిఎం కెసిఆర్‌ ‌పిలుపు
*తమిళనాడు సర్కార్‌ ‌సాయంపై హర్షం

‌భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన హైదరాబాద్‌ ‌ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చూపాలన్నారు. సీఎం రిలీఫ్‌ ‌పండ్‌కు విరివిగా విరాళాలు అందించాలని సీఎం కేసీఆర్‌ ‌కోరారు. నగరంలో వరదలకు ప్రభావితమైన పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్‌ ‌శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్‌ ‌నగరంలోని ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్‌ ‌తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బాధితులకు అండగా నిలవాలన్నారు. సర్కార్‌కు సాయం అందించి పెద్ద మనసు చాటాలన్నారు. ఇదిలావుంటే  తెలంగాణ ప్రభుత్వానికి బాసటగా నిలిచిన తమిళనాడు సర్కార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా, బ్లాంకెట్లు, చద్దర్లతో పాటు ఇతర సామాగ్రి కూడా పంపుతామని ప్రకటించినందుకు తమిళనాడు ప్రభుత్వానికి కేసీఆర్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చినందుకు సీఎం పళనిస్వామికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ ‌సహా ఇతర జిల్లాల్లో ముంపు బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును సీఎం పళనిస్వామి ప్రశంసించారు. తెలంగాణకు రూ. 10 కోట్లు ప్రకటిస్తూ సీఎం కేసీఆర్‌కు తమిళనాడు సీఎం లేఖ రాశారు. ఇకపోతే హైదరాబాద్‌ ‌నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో గత వందేండ్ల చరిత్రలో వచ్చిన భారీ వర్షాల వల్ల ఎంతో మంది నష్టపోయారు. వారికి పెద్ద మనసుతో ఆర్థిక సహాయాన్ని అందిస్తూ.. సీఎం కేసీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ భారీ వర్షాల వల్ల  ప్రభావితమైన ఇండ్లకు పది వేలరూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు యాభై వేల రూపాయలు, పూర్తిగా కూలిపోయిన ఇండ్లకు లక్ష రూపాయల పరిహారాన్ని అందజేయాలని తీసుకున్న నిర్ణయంపై రంగారెడ్డి, వికారాబాద్‌ ‌జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply