వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆరోగ్య తెలంగాణయే సిఎం కేసీఆర్‌ ‌కోరిక: మంత్రి హరీష్‌రావు

January 20, 2020

Telangana CM KCR wish for health Minister Harish rao

  • కంటి సమస్యల నుండి విముక్తికే కంటి వెలుగు
  • సిద్ధిపేటలో క్యాన్సర్‌ ‌స్కీనింగ్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
  • పార్థసారథిరెడ్డిని కోరిన హరీష్‌రావు
  • సిద్ధిపేటలో ఎల్వీ ప్రసాద్‌ ‌కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా చేయడమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరిక అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం సిద్ధిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద నిర్మించిన ఎల్వీ ప్రసాద్‌ ‌కంటి ఆసుపత్రిని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…సిఎం కేసీఆర్‌ ‌రాష్ట్రంలో కంటి సమస్యలు లేకుండా చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌మాట్లాడుతూ.. సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్‌ ‌కంటి ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు జీఎన్‌ ‌రావు, పార్థసారథికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. గతంలో హైదరాబాద్‌, ‌వరంగల్‌లో మాత్రమే మెడికల్‌ ‌కాలేజీలు ఉండేవన్నారు. కానీ, కేసీఆర్‌ ‌ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక మెడికల్‌ ‌కాలేజీలు తేవడం జరిగిందన్నారు. సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో సేవాకార్యక్రమాలు చేస్తున్న హెటిరో డ్రగ్స్ ‌సంస్థ చైర్మన్‌ ‌పార్థసారథి రెడ్డి కృషి అభినందనీయమన్నారు. పేదలకు తక్కువ ధరకే మందులను అందిస్తున్న సంస్థ హెటిరోడ్రగ్స్ అన్నారు. సమాజానికి, పేదవారికి సేవ చేసినప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందన్నారు. ప్రతి 50 వేల మందికి ఒక సబ్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేటి తరానికి సెల్‌ఫోన్‌ ‌ద్వారా ఎన్నో కంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయన్నారు. కార్పొరేట్‌ ‌స్థాయి కంటి వైద్యం ఇక్కడ లభిస్తుందన్నారు. అదేవిధంగా పేద ప్రజలకోసం రూ.400 కోట్లతో పార్థసారథి క్యాన్సర్‌ ఆసుపత్రిని నిర్మిస్తున్నరన్నారు. సిద్దిపేటలో సైతం క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు.వేలాది మందికి వెలుగును ఇచ్చిన వ్యక్తి పార్థసారథి రెడ్డి అన్నారు. ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి 1987 ప్రారంభం చేసి నాలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రజలకు సేవాలు అందిస్తున్నారని తెలిపారు.

బంజారాహిల్స్ ఆస్పత్రిలో ఏ మెటీరియల్‌ ఉం‌దొ, సిద్దిపేట ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో కూడా అదే ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజలు మంచిగా వినియోగించుకోవాలన్నారు. ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో కంటి చూపుపై శిక్షణ ఇస్తారన్నారు.నాలుగు రాష్ట్రాల్లో 19 ఎల్వి ప్రసాద్‌ ‌సెంటర్లు ఉన్నాయన్నారు. సిద్ధిపేటలో నిర్మించింది 20వ ఆసుపత్రి అన్నారు. జిల్లా చుట్టూపక్కాల ఉన్న 5లక్షల ప్రజలు కంటి చూపు, బిపి, షుగర్‌ ఉన్నవాళ్లు వినియెగించుకోవాలని తెలిపారు. ఇంత మంచి కంటి ఆసుపత్రిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు. ఈ ప్రారంభోత్సవంలో మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాణి, జెసి పద్మాకర్‌, ఎల్వీ ప్రసాద్‌ ఆసుప్పతి చైర్మన్‌ ‌జీఎన్‌రావు, హెటిరో డ్రగ్స్ ‌చైర్మన్‌ ‌పార్థసారథిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

Tags: Dak MP New Prabhakar Reddy, MLC Raghottam Reddy, Zilla Parishad Chairperson Velity Rojrani, JC Padmakar, LV Prasad Hospital Chairman Jeenrao, Hetero Drugs Chairman