Take a fresh look at your lifestyle.

దిల్లీలో సీఎం కేసీఆర్‌ ‌బిజీ..బిజీ

కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌, ‌హోమంత్రి అమిత్‌షాతో భేటి

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌తో భేటీ అయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజైన శుక్రవారం కేసీఆర్‌ ‌షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం సహకారంపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టుల పురోగతి గురించి ఆయనకు వివరించినట్లు సమాచారం. అలాగే, ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాల విషయంలో ఇటీవల తలెత్తిన వివాదాలపైనా సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిసింది. తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పధకంపై అభ్యంతరాలు వ్యక్తం చేయటంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిత్యం 3 టీఎమ్‌సీ ల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి కోరారు.
ఆ తరువాత సీఎం కేసీఆర్‌ ‌కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షాతో సమావేశమై హైదరాబాద్‌లో వరదలు ఆకాల వర్షాల సమాయంలో విపత్తు నిర్వాహన కింద రావల్సిన నిధులు, పోలీస్‌ ‌వ్యవస్థ ఆధునీకీకరణ, వెనుకబడిన జిల్లాలకు రావల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. అంతకు ముందు ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కాగా మూడు రోజుల పర్యనటలో సీఎం కేసీఆర్‌ ‌ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై దీర్ఘకాలికంగా పెండిగ్‌లో ఉన్న  సమస్యలపై చర్చించనున్నారు.  శుక్రవారం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంగ్రసింగ్‌ ‌షెకావత్‌తో భేటీ అయిన సీఎం శనివారం పౌరవిమానయాన, హౌసింగ్‌ ‌శాఖల మంత్రి హర్దీప్‌సింగ్‌ ‌పురిలతో భేటీకి సంబంధించిన షెడ్యూల్‌ ‌ఖరారైనట్టు తెలిసింది. అదే విధంగా కేంద్ర మంత్రులు నితిన్‌ ‌గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో సీఎం కేసీఆర్‌ ‌భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఆయన తిరిగి హైదరాబాద్‌కు వొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

Leave a Reply