Take a fresh look at your lifestyle.

‘స్మార్ట్‌ సిటీస్‌ ఆవార్డ్స్-2020’‌లో తెలంగాణ గాయబ్ ..!?

  • ‘మోస్ట్ ఈవెంట్ సిటీ హైదరాబాద్’ కు దక్కని గుర్తింపు  ..
  • అదే వరుసలో  రెండు స్మార్ట్ సిటీలు వరంగల్‌, కరీంనగర్
  •  జాబితా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 
  కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ‘స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌’ తాజాగా విడుదల చేసిన 100 స్మార్ట్ మరియు 26 ఇతర నగరాల ప్రగతి విశ్లేషణ ఆధారంగా పలు రంగాల్లో ‘స్మార్ట్‌ సిటీస్‌ ఆవార్డ్స్‌-2020’ జాబితాను విడుదల చేసింది.తెలంగాణకు చెందిన రెండు స్మార్ట్ సిటీలు వరంగల్‌, కరీంనగర్ మరియు  మహానగరం హైదరాబాద్‍ కు  జాబితాలో చోటు దక్క లేదు. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రగతి ప్రదర్శించిన ఇండోర్‌, సూరత్‌ మహానగరాలు ఉమ్మడిగా ‘ఫస్ట్‌ బెస్ట్ సిటీస్‌’గా ఆవార్డులకు ఎంపికైనాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఛండీగర్‌ నగరం ఉత్తమ సిటీగా ఆవార్డు పొందింది.
దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలు, 26 ఇతర నగరాల ప్రగతి నివేదికలు, సర్వేలు చేసి అంతిమ జాబితాను 25 జూన్‌ 2021న విడుదల చేశారు. స్మార్ట్‌ నగరాల్లో ‘4-స్టార్‌ రేటింగ్’ పొందిన 9 నగరాల్లో సూరత్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‍, పూనె, విజయవాడ, రాజ్‌కోట్‌, విశాఖపట్నం, పింప్రీ-చించ్వాడ్‌ మరియు వడోదరలు‌‌ చోటు దక్కించుకున్నాయి. స్మార్ట్‌ సిటీస్‌ లీడర్‌షిప్‌ ఆవార్డును అహ్మదాబాద్‍, వారణాసి, రాంచీలు గెలుచుకున్నాయి.  అన్నిరంగాల్లో అత్యుత్తమ ప్రగతి కనబరిచిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ‘ఫస్ట్‌ బెస్ట్ స్టేట్‌’ ఆవార్డుకు ఎంపికైంది. ఉత్తమ రాష్ట్రాల జాబితాలో తరువాత స్తానాల్లో మధ్యప్రదేశ్, తమిళనాడులు చోటు దక్కించుకున్నాయి. యుపీ రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా 7 (మీరట్‌, ఫిరోజాబాద్‍, గోరఖ్‌పూర్‌, మథురా-బృందావన్‌, సరహన్‌పూర్‌, గాజియాబాద్‍, అయోధ్య) నగరాలను స్మార్ట్‌ సిటీస్‌గా అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం సంతోషదాయకమని నివేదిక తెలియజేస్తున్నది. స్మార్ట్‌ సిటీ మిషన్‌ ప్రారంభించి 6 ఏండ్లు పూర్తి అయిన వేళ ఈ ఆవార్డులు విడుదల చేశామని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
                               స్మార్ట్‌ సిటీస్‌ ఆవార్డులు-2021 రూపొందించుటలో పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. సాంఘీక అంశాలు, నగర పాలన, సంస్కృతి/నాగరికత, నగర పర్యావరణం, పారిశుధ్యం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణహిత నిర్మాణాలు, రక్షిత నీరు, సుస్థిరాభివృద్ధి వ్యాపార నమూన, పట్టణ రవాణ, వినూత్న ఆలోచనలు, కోవిడ్‌-19 వినూత్న ఆలోచనలు లాంటి వర్గాల్లో 126 నగరాల ప్రగతిని విశ్లేషించి ఆయారంగాల్లో ఆవార్డులు ప్రకటించారు.
 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల ప్రగతి వివరాలు:
                   కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం స్మార్ట్‌ సిటీ మిషన్‌ పరిధిలోన 100 స్మార్ట్‌ నగరాల్లో 1.78 లక్షల కోట్లతో 5,924 ప్రాజెక్టులు టెండరింగ్‌ అయ్యాయని, నేడు 1.46 లక్షల కోట్ల విలువైన 5,236 ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని, 45,080 కోట్ల విలువైన 2,665 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని తెలిపింది. దేశంలోని 70 స్మార్ట్‌ మహానగరాల్లో కోవిడ్‌-19 నియంత్రణ చర్యలతో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లు (ఐసిసిసి) సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. దేశ నగరాల్లో 310 స్మార్ట్‌ రోడ్లు పూర్తి కాగా, 459 రోడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
ఆంద్ర ప్రదేశ్ కు  స్మార్ట్ సిటి ఆవార్డులు:
               స్మార్ట్ సిటీస్‌ ఆవార్డుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలు చోటు దక్కించుకున్నాయి..  సాంఘీక అంశాలు మరియు పారిశుధ్యం అనబడే రెండు విభాగాల్లో తిరుపతి ప్రథమ స్థానంలో నిలవడం, ఆర్థిక వ్యవస్థ అనే ఒక విభాగంలో ద్వితీయ, నగర పర్యావరణం అనే మరో విభాగంలో తృతీయ స్థానాల్లో నిలిచి ఆంధ్రకు గర్వకారణంగా నిలిచింది. 4-స్టార్ రేటింగ్‌ పొందిన 9 నగరాల్లో విశాఖపట్నం, విజయవాడలు చోటు దక్కించుకుంది.. తిరుమల వెంకన్న కోవెల ముందున్న తిరుపతి మహానగరానికి పలు స్మార్ట్‌ సిటీ ఆవార్డులు దక్కించుకుంది.

Leave a Reply