Take a fresh look at your lifestyle.

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌సమావేశం

లాక్‌డౌన్‌ ‌సహా పలు అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం జరుగనున్న కేబినేట్‌ ‌సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నో కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ ‌కొనసాగింపు.. ఖరీఫ్‌ ‌సీజన్‌ ‌ప్రారంభం అంశాలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించనుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ముఖ్యమైన అంశం వేతన సవరింపు సంఘం (పీఆర్సీ) కూడా అజెండాలో ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో పీఆర్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల వేతన సవరణ నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. ఇప్పటికే వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల ఫిట్‌మెంట్‌, ఇతర అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ ‌పీఆర్‌సీని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డ్ ‌డౌన్‌ ‌మరోసారి పొడిగించవద్దని సర్కారు భావిస్తున్నది…పగటి పూట పూర్తిగా లాక్డ్ ‌డౌన్‌ ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు నైట్‌ ‌కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని సమాచారం. వ్యాపారాలతో పాటు మెట్రో, బస్సులకు సాయంత్రం 7 వరకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం 2 గంటల వరకు సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 9 తో రాష్ట్రంలో లాక్డ్ ‌డౌన్‌ ‌ముగియనుంది.

Leave a Reply