Take a fresh look at your lifestyle.

13‌న రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

ఈ ‌నెల 13వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కొరోనా పరిస్థితులు, వ్యవసాయం, పల్లె, పట్టణ ప్రగతి తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

అలాగే తాజాగా జలవివాదం నేపథ్యంలో కేబినేట్‌ ‌భేటీకి ప్రాధాన్యం ఉంది. కృష్ణాజలాల పంపిణీ విషయంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు చర్చించే అవకాశం ఉంది. కృష్ణబోర్డు సమావేశంలో చర్చించే అంశాలను కూడా కేబినేట్‌ ‌పరిశీలించనుంది.

Leave a Reply