Take a fresh look at your lifestyle.

20 ‌వరకు బడ్జెట్‌ ‌సమావేశాలు

తెలంగాణ బడ్జెట్‌ ‌సమావేశాలను ఈనెల 20 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అసెంబ్లీలో శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌ప్రసంగం అనంతరం స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌, ‌శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ పక్షనేత రాజాసింగ్‌ ‌హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు.

ఈనెల 8న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020 21 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. 9, 10 రెండు రోజుల విరామం అనంతరం శాసనసభ తిరిగి ఈనెల 11న సమావేశమవుతుంది. ఆ తరువాత శనివారం గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నిర్వహిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ‌దానికి సమాధానం చెబుతారు. అనంతరం దానిని ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. అదే రోజు ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్‌పై తొలి రోజు చర్చ జరుగుతుంది. 12న రెండో రోజు బడ్జెట్‌పై చర్చను కొనసాగించడంతో పాటు సభ్యుల సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది.13న ఈ వార్షిక సంవత్సరానికి గ్రాంట్లకు సంబంధించిన డ్రాఫ్టులపై వోటింగ్‌ ‌జరుగుతుంది. వీటిలో భాగంగా సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగుతుల సంక్షేమంతో పాటు స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమం శాఖలకు సంబంధించిన చర్చ నిర్వహిస్తారు.

14న రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌ అడ్మినిస్ట్రేషన్‌, ‌కమర్షియల్‌ ‌టాక్సులు, ట్రాన్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్‌, అ‌గ్రికల్చర్‌, ‌యానిమల్‌ ‌హజ్బండరీ, ఫిషరీస్‌, ‌కో ఆపరేషన్‌, ‌సివిల్‌ ‌సప్లయిస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన బిల్లులపై చర్చ జరుగుతుంది. 15న బడ్జెట్‌ ‌సమావేశాలకు విరామం ప్రకటించారు. తిరిగి ఈనెల 16న బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు స్కూల్‌ ఎడ్యుకేషన్‌, ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ‌స్పోర్టస్,‌యూత్‌ ‌సర్వీసెస్‌, ‌మెడికల్‌, ‌హెల్త్‌పై చర్చ జరుగుతుంది, 17న లేబర్‌ ఎం‌ప్లాయ్‌మెంట్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఆప్‌ ‌రిలీజియస్‌, ఎం‌డోమెంట్స్, ‌ఫారెస్ట్, ‌సైన్క్ అం‌డ్‌ ‌టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్‌, ఇం‌డస్ట్రీస్‌, ‌కామర్స్, ‌టూరిజం,కల్చర్‌, ఐటి కమ్యూనికేషన్లు, పబ్లిక్‌ ఎం‌టర్‌‌ప్రైజెస్‌ ‌శాఖలకు కేటాయింపులపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. 18న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌తదితర శాఖలపై చర్చ జరుగుతుంది. ఇక 20న డ్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం అనంతరం శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలు ముగుస్తాయి.

Tags: On 14th Revenue, Registration, Excise Administration, Commercial Taxes, Transport Administration, Agriculture, Animal Husbandry, Fisheries, Co Operation, Civil Supplies Administration

Leave a Reply