Take a fresh look at your lifestyle.

బడ్జెట్‌లో విద్యకు నిరాదరణ..!

  • విద్యారంగ నిఫుణుల సిఫారసులు పట్టించుకొని ప్రభుత్వం
  • తగ్గిపోతున్న కేటాయింపులు, పేరుకుపోతున్న సమస్యలు
  • 2014-15లో 10.89శాతం, 2020-21లో 6.69 శాతం

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తేదీ నుంచి విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్‌ ‌నిధులే ఇందుకు ఉదాహరణ .ప్రతీ సంవత్సం బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖకు ప్రతీ ఏడాది నిధులు తగ్గించడం పట్ల ప్రొఫెసర్లు, విద్యారంగ నిపుణులఱు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసన తెలియచేస్తున్నాయి. విద్యారంగానికి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు జరి•పే రాజ్యమే అభివృద్ధి చెందిన రాజ్యమని రాజనీతిశాస్త్ర నిపుణులు చాలా సందర్భాల్లో ఉదహరించారు. 2014 నుంచి బడ్జెట్‌ను పరిశీలించినట్లయితే విద్యారంగానికి ప్రతీ ఏడాది మొత్తం బడ్జెట్‌లో నిధుల శాతాన్ని తగ్గిస్తూ వచ్చారని, ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే తెలియచేస్తున్నాయి.

telangana Budget for Education

2014-15 ఆర్థిక సంవత్సరంలో 10.89శాతం నిధులు విద్యకు ఇచ్చారు.2015-16లో 9.69 శాతం కేటాయించారు.ఏడాదిలోనే 1.20శాతం నిధులు విద్యారంగానికి బడ్జెట్‌లో కోతపెట్టారు. ఒకవైపున ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీలో ఉపాధ్యాయులకు కుర్చీలులేక, విద్యార్థులకు బెంచేలు,నల్లబల్లలు లేక సతమతమవుతున్నారు.కానీ నిధులు ఏయేటీకాయేడు తగ్గిస్తున్నారు. అదేవిధంగా 2016-17 విద్యాసంవత్సరంలో 8.23శాతం ఇచ్చారు. 2017-18లో 8.49శాతం కేటాయించారు. అయితే 2017-18లో కన్నీటి తుడుపు మాదిరిగా .26శాతం పెంచారు.2018-19లో 7.61శాతం నిధులు కేటాయించారు. 2019-2020 సంవత్సరంలో 6.7శాతం ఇచ్చారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 1,82914కోట్లలో 10,421కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపు మొత్తం బడ్జెట్‌లో 6.69శాతం మాత్రమే. ఈ కేటాయింపు వర్తమాన విద్యాశాఖ అవసరాలను ఏ మాత్రం తీర్చలేదని చాలా స్పష్టంగా చెవ్పవచ్చునని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.

- Advertisement -

తెలంగాణ వచ్చి 2014 నుంచి గమనిస్తే 2020 నాటికి దాదాపు 5 శాతం నిధులను తగ్గించారు. ఈ విధంగా తగ్గించిన నిధులతో పాఠశాలలు, కళాశాలలు, కస్బూర్బా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.రాష్ట్రంలో 2000 పాఠశాలల్లో మంచినీరు సదుపాయం లేదని, ఎప్పుడు కూలిపోతాయో తెలియని భవనాల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని విమర్శిస్తున్నారు.రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభించిన 759 గురుకులపాఠశాలల్లో 50 పాఠశాలలకు మాత్రమే భవనాల సదుపాయం ఉన్నదని, మిగతా పాఠశాలలన్నీ కిరాయి భవనాల్లో నడుస్తున్నాయి.కిరాయి భవనాల్లో, అతితక్కువ వసతులతో నిధులతో అంతర్జాతీయ ప్రమాణాల విద్యను ఏ విధంగా అందించగలుగుతారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ‌ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 60 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్న సందర్భంలో ఈ విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అవసరంలేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.

రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఉన్నత విద్యకోసం కేటాయించిన 1723.27కోట్ల కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని విమర్శలు వస్తున్నాయి. యూనివర్శిటీ టీచర్ల అసోసియేషన్లు, విద్యార్థి సంఘాలు తమ సమస్యలకు పరిష్కారాలు ఎప్పుడు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీ యింబర్స్ ‌బకాయిలు రూ.4170 కోట్లు ఉండగా, 2650 కోట్లు మాత్రమే కేటాయింపులు ఇచ్చారు. అధ్యాపకులు జీత భత్యాలకు కూడా నిధులు లేని పరిస్థితులను కల్పిస్తున్నారు. ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా 25వేల ఉపాధ్యాయుల పోస్టులు, వేలాదిగా యూనివర్శిటీల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌పొస్టులు ఖాళీగా ఉన్నాయి, కొన్ని విశ్వవిద్యాలయాలల్లో పరిపాలనా సిబ్బంది లేనేలేరు.6000 పాఠశాలల్లో విద్యావాలంటీ•ర్లే పాఠశాలలను నడిపిస్తున్నారు.

వేలాది పాఠశాలలకు ప్రహరీలు లేవు, బాలికల పాఠశాలల్లో కూడా సరిపోయినన్ని మరుగుదొడ్లు లేవు. ఇంత అధ్వాన్నంగా ఉన్న విద్యారంగాన్ని ఈ తక్కువ నిధులతో చికిత్స చేయడం సాధ్యపడదని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన కొఠారి కమిషన్‌ ‌సిఫారసులను తుంగలో తొక్కారు. జనతాప్రభుత్వం ఏర్పరిచిన ఈశ్వరీబాయి కమిషన్‌ ‌పాఠశాలల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలని, విద్యార్థులు చదువుకోవడానిక• ఆహ్లాద వాతావరణం ఉండాలని, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేవిధంగా పాఠశాలలు,కళాశాలల వాతావరణం ఉండాలని చాలా సూచనలు, సిఫారసులు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన పీ.వీ.నరసింహారావు కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు, అనేక సూచనలు కూడా చేశారు. అయితే 2014 ఎన్నికల్లో ఉద్యమ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కేజీటూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రతీ సభలో వాగ్దానం చేశారు.

ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లను నిరాశపరిచిన బడ్జెట్‌:
‌రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షననర్లను నిరాశపరిచిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ అధ్యక్షులు కే.సంగయ్య, ప్రధానకార్యదర్శి చావా రవి విమర్శించారు. ఫిబ్రవరి 25ననే పీఆర్సీపైన ప్రకటన ఉంటుందని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్‌లో పీఆర్సీపై ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలు ఆందోళనలు పోరాటాల ద్వారానే పరిష్కారమవుతాయని వారు స్పష్టంచేశారు.

Leave a Reply