రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ.. బిజెపి నేతల ముందస్తు అరెస్ట్‌లు
జిల్లాల్లో నేతల గృహనిర్బంధాలు
ప్రగతిభవన్ వద్ద భారీగా పోలీసుల మొహరింపు
బిజెపి ఆందోళనతో భాగ్యనగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన క్రమంలో బిజెపి నేతలను ఎక్కడిక్కడే గృహనిర్బంధంచేశారు. దీంతో హైదరాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలు..మరీ ముఖ్యంగా ప్రగతిభవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే రాత్రి నుంచి బీజేపీ ఆఫీస్‌లోనే రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కుమార్
ఉన్నారు. బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. నేతల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ప్రగతిభవన్, తెలంగాణ భవన్, డీజీపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలీసులు చెక్ పోస్టులు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ముట్టడికి ప్రయత్నిస్తారనే అనుమానంతో ముందస్తుగా భారీగా బందోబస్తు నిర్వహించడం జరిగింది.
ఉన్నారు. బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. నేతల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ప్రగతిభవన్, తెలంగాణ భవన్, డీజీపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలీసులు చెక్ పోస్టులు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ముట్టడికి ప్రయత్నిస్తారనే అనుమానంతో ముందస్తుగా భారీగా బందోబస్తు నిర్వహించడం జరిగింది.
హైదరాబాద్‌లో నిరసనల పేరుతో శాంతి భద్రతలు దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్న మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతల ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి నుంచే హైదరాబాద్ సహా..జిల్లాల్లో బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌కు వెళ్తారన్న సమాచారం ఉందంటూ జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలను స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్ బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. అటు తెలంగాణ భవన్, డీజీపీ ఆఫీస్ దగ్గర భారీగా బలగాలను మోహరించారు. ముట్టడికి వొస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్‌లో ఎక్కడికక్కడే నేతలను అరెస్ట్ చేస్తున్నారు. రాజేంద్రనగర్, నార్సింగి, మైలార్ దేవ్ పల్లిలో ఇండ్లలోనే నేతలను అదుపులోకి తీసుకుని..స్టేషన్‌కు తీసుకెళ్లారు. మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, బీజేపీ కౌన్సిలర్లు, నేతలను రాయదుర్గం పీఎస్‌కు తరలించారు. అటు జిల్లాల్లో అర్ధరాత్రి నేతల ఇళ్లలోకి వెళ్లి మరీ బైండోవర్ చేశారు పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్ల, ధర్మపురిలో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. వరంగల్ నగరంలో అరెస్టులు చేస్తూనే.. నేతల ఇళ్ల ముందు పహారా కాస్తున్నారు. ప్రభుత్వం పోలీసుల సాయంతో బెదిరిస్తూ అక్రమ కేసులు పెడుతోందని బిజెపి నేతలు ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలు ఖండిస్తూ.. జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. గంగల శ్రీనివాసయాదవ్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపిన విషయం విధితమే. కార్యాలయ సిబ్బంది, స్థానికులు శ్రీనివాస్ ఒంటిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. వెంటనే అతణ్ని పోలీసుల సహాయంతో ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కి తరలించారు. అయితే శ్రీనివాస్ శరీరం యాభై శాతానికి పైగా కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు.