Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ప్రభుత్వం పై బీజేపీ నేతల సంచలన ఆరోపణ

ఖజానా నుంచి ఒక్క డోసు కొనలేదు ..!
కేంద్రమే భరిస్తుంది ..:రాష్ట్ర బీజేపీ నాయకులు
హైదరాబాద్,మే 28: టీఆర్ఎస్ లో కార్యకర్త నుంచి కేటీఆర్ దాకా వ్యాక్సిన్ విషయం లో కేంద్రాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు..అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా.ప్రకాష్ రెడ్డి విరుచుకు పడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచలేదు, ఎక్కువ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వలేదు అంటూ టీఆరెస్ విమర్శలు చేస్తోంది..వ్యాక్సిన్ అంటే ఫార్మా కంపెనీలో తయారయ్యే రసాయన పదార్థమో, సింథటిక్ పదార్థమో కాదు , అది జీవ పదార్థం అని తెలుసుకోవాలి ఆయన అన్నారు. వ్యాక్సిన్ కల్చర్ ఎట్లా తయారు చేస్తారు, ఎంత టైం పడుతుందో ముందు తెలుసుకోండి..ఇకనైనా వ్యాక్సిన్ రాజకీయాలు మానండి..అని ప్రకాష్ రెడ్డి హితవు పలికారు.అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణకు కూడా కేంద్రం వ్యాక్సిన్ ఇచ్చింది అని తెలిపారు…

రాష్ట్రానికి వచ్చిన వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకుని, ప్రజలకు సకాలం లో వ్యాక్సినేషన్ చేయండి అని హితవు పలికారు. ఇదే సమావేశంలో స్వామిగౌడ్, రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ మాట్లాడుతూ ..వ్యాక్సిన్ విషయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోంది..రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పెట్టి ఒక్క డోసు కూడా కొన లేదు..కానీ వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర కేసీఆర్ ఒక్కరి ఫోటో మాత్రమే పెట్టారు..రాష్ట్రానికి ఇప్పటిదాకా 71 లక్షల డోసు లను కేంద్రం ఇచ్చింది…కానీ వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు ఎందుకు పెట్టలేదు..కేంద్రం పంపించిన వ్యాక్సిన్ వేస్తూ మీ డబ్బా కొట్టుకుంటారా…వెంటనే అన్నీ వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ప్రధాని మోదీ గారి ఫోటో లు పెట్టాలి…” అని ప్రశ్నించారు.

Leave a Reply