Take a fresh look at your lifestyle.

కొరోనా నియంత్రణపై తెలంగాణ చర్యలు భేష్‌

‌కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌
అన్ని రాష్ట్రాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్

కొరోనా ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రుతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బూర్గుల రామకృష్ణారావు భవన్‌ ‌నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఆ ‌శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, డీఎంఈ డా.రమేశ్‌ ‌రెడ్డి, డీహెచ్‌ ‌డా.శ్రీనివాస్‌, ‌కొరోనా నిపుణుల కమిటీ సభ్యులు డా.గంగాధర్‌, ‌డా.కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి అభినందించారు. టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు పలు ఇతర అంశాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌

‌మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతీ 8 మందిలో ఒకరికి కొరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 65 ఆర్‌టిపిసిఆర్‌ ‌కేంద్రాలు పనిచేస్తున్నాయనీ, ఇప్పటి వరకు తెలంగాణలో 48 లక్షల టెస్టులు చేయడం జరిగిందనీ, అందులో 5 శాతం మందికి మాత్రమే పాజిటివ్‌గా వచ్చిందని వెల్లడించారు. జిల్లా కేంద్రాలతో పాటు సిహెచ్‌సి, పిహెచ్‌సి, సబ్‌ ‌సెంటర్లలో అన్ని చోట్లా కొరోనా పరీక్షలు  నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఆక్సీజన్‌ ‌కొరత లేదనీ, అన్ని హాస్పిటల్స్‌లో లిక్విడ్‌ ఆక్సీజన్‌ ‌సిలిండర్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. మున్ముందు రోజుల్లో కొరోనా కేసులు పెరిగినా కూడా ఎదుర్కునేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నామని సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే, కొరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలనీ, పంపిణి విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని ఈటల కోరారు.
బీబీనగర్‌ ఎయిమ్స్‌పై సమీక్ష
బీబీనగర్‌ ఎయిమ్స్ ‌హాస్పిటల్‌పై మంత్రి ఈటల సమీక్షా సమావేశం నిర్వహించారు. నిమ్స్ ‌హాస్పిటల్‌ ‌డైరెక్టర్‌, ఇతర డాక్టర్లతో సమావేశమై ఎయిమ్స్‌లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, అకడమిక్‌ ‌వివరాలను తెలుసుకున్నారు. హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులు, నిర్వహణ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. నీటి సరఫరా, బిల్దింగ్‌ ‌నిర్మాణం, ఇతర సమస్యలు లేకుండా చూస్తామని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని మంత్రి ఈటల ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply