Take a fresh look at your lifestyle.

ఈ నెల 28 వరకు తెలంగాణా అసెంబ్లీ

  • అవరమైతే పొడిగింపు బీఏసీ నిర్ణయం
  • మీడియా పాయింట్ ఎత్తివేత అంశంపై   సీఎం కేసీఆర్ ,సిఎల్పీ నేత భట్టి మధ్య వాడివేడి చర్చ

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయని బీఏసీ నిర్ణయించింది..అలాగే  అవసరం అయితే సమావేశాల్ని పొడగించడానికైనా సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తము 17 పని దినాలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.సోమవారం మొదటి రోజు సమావేశం అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ అధ్యక్షత న జరిగిన బీఏసీ సమావేశం కొంత హాట్ హాట్ గా కొనసాగింది.  సభని ఎన్ని రోజులు నిర్వహిద్దామని అనుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  అడిగారు. మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిర్వహిస్తామన్నారు సీఎం కేసీఆర్.  మేము కూడా ప్రజలకు చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయని  అన్ని విషయాలపై మాట్లాడతాం అని  కేసీఆర్ సమాధానం ఇచ్చిన్నట్లు సమాచారం. ఇక మీడియా పాయింట్ ఎత్తివేత అంశంపై కొంత మాటలు పెరిగాయి. మీడియా పాయింట్ ఎలా ఎత్తేస్తారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

మా పాత్ర ను కూడా మీరే కట్టడి చేస్తే ఎలా..మీరు ఇక్కడ మైక్ ఇవ్వరు.. కనీసం మీడియా పాయింట్ అయినా ఉంచాలి కదా అని సీఎల్పీ నేత భట్టి అడిగారు. సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా.. అబద్దాలు మాట్లాడొద్దు… సభలో మైక్ ఎందుకు ఇవ్వటం లేదు…సభ్యుల సంఖ్యని బట్టి సమయం ఇస్తారన్నారు సీఎం. ఇక కొత్త రెవెన్యూ చట్టం పై సీఎం కేసీఆర్ బీఏసీ లో చర్చించారు. కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు…అందుకే రికార్డులు సీజ్ చేయండి అని ఉదయమే ఆర్డర్ ఇచ్చాం అన్నారు కేసీఆర్. రెవెన్యూ చట్టం సభలో పెట్టిన తర్వాత… స్టడీ చేయడానికి 4 రోజులు గడువు ఇవ్వాలని కోరారు భట్టి విక్రమార్క . అంత సమయం ఎందుకు అని అడిగారు సీఎం.మీరు బిల్లు తయారు చేయడానికి 3 యేండ్లు పట్టింది… మేము స్టడీ చేయడానికి 4 రోజులు సమయం ఇస్తే తప్పేముంది అన్నారు భట్టి విక్రమార్క . రెవెన్యూ చట్టం చాలా కఠినంగా చేస్తున్నామన్నారు కేసీఆర్. సభ పని దినాలు పొడగించాలనే అనుకుంటే మళ్ళీ బీఏసీ  ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply