Take a fresh look at your lifestyle.

రేపటి నుంచి అసెంబ్లీ

  • కొరోనా, సచివాలయ కూల్చివేత, వరదలపై చర్చకు కాంగ్రెస్‌ ‌పట్టుబట్టే అవకాశం
  • గట్టి పోలీసుల బందోబస్తు..పరిసరాల్లో 144 సెక్షన్‌

అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్దం అయ్యింది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చకు కాంగ్రెస్‌ ‌సిద్దం అవుతోంది. ప్రధానంగా కొరోనా చికిత్సలు, వరదలు, ప్రభుత్వ అవినీతి, సచివాలయ కూల్చివేత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తోంది. సమస్య ఏదైనా గట్టిగానే సమాధానం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఎలాంటి సమస్య అయినా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే మంత్రులను సన్నద్ధం చేశారు. వివిధ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అన్నారు. హైకోర్టు నిలదీసిన, గవర్నర్‌ ‌వ్యాఖ్యానించిన విషయాలు ప్రస్తావిస్తామని అన్నారు.  మరోవైపు కొరోనా కారణంగా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలు లేవు. ఆర్థికమంత్రి హరీష్‌ ‌రావుకు కొరోనా సోకడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరం కానున్నారు. కాగజ్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే కోనప్ప కూడా కొరోనా బారిన పడ్డారు. ఇదిలావుంటే వై•రస్‌ ‌నెగెటివ్‌ ‌వస్తేనే అసెంబ్లీ సమావేశాలకు అనుమతిస్తామని స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయని అందువల్ల ఎవరికి వారు కొరోనా జాగ్రత్తుల తీసుకుని రావాలని శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ ‌చేయించారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. మాస్కు ఉంటేనే సభలోకి అనుమతి ఉంటుందని కూడా తేల్చి చెప్పారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరని కూడా తేల్చారు. శరీర ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటేనే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో కొరోనా టెస్టింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసి, టెస్టులు మొదలు పెట్టారు. స్పీకర్‌ ‌పోచారం సహా అంతా టెస్ట్ ‌చేయించుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, డియా ప్రతినిధులు, మంత్రుల పీఎస్‌లు, పీఏలకు తప్పనిసరిగా కోవిడ్‌ ‌పరీక్షలు చేయిస్తున్నారు. కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌తేలితే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావొద్దని స్పీకర్‌ ‌విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల పీఏలను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరని స్పీకర్‌ ‌తెలిపారు. అన్ని ప్రవేశాల వద్ద థర్మల్‌ ‌స్క్రీనర్లు ఏర్పాటు చేశారు. కొరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్లమెంటు ఇచ్చిన గైడ్‌ ‌లైన్స్ ‌ప్రకారమే సమావేశాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభా వ్యవహారా మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి చెప్పారు. మరోవైపు పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్‌ ‌విధించారు. ఎమ్మెల్యే లు బయట చేయించుకున్నా సరే.. నెగటివ్‌ ‌రిపోర్ట్ ‌చూపిస్తెనే అసెంబ్లీలోకి అనుమతిస్తామన్నారు. లాబీల్లోకి, మంత్రుల ఛాంబర్‌లోకి డియా ప్రతినిధులకు అనుమతి నిషేధించారు.

 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply