తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. బిల్లులను పరిశీలిస్తే.. – తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు ఇందులో ప్రధానమైనదిగా చెప్పుకోవాలి. ప్రైవేట్ వర్సిటీలకు ఇది అనుమతించే బిల్లు కావడం విశేషం. తెలంగాణ విపత్తు, ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. అలాగే తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లును ఆమోదించారు.
తెలంగాణ కోశ బాధ్యత , బ్జడెట్ నిర్వహణ బిల్లు తెలంగాణ వస్తు, సేవల పన్ను సవరణ బిల్లులను కూడా సభ ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధృవీకరణ విధానం బిల్లుతో పాటు తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లులకు కూడా సభ ఆమోదం లభించింది. ఇకపోతే తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి.