Take a fresh look at your lifestyle.

28 ‌వరకు అసెంబ్లీ సమావేశాలు

  • 12, 13 20, 27 తేదీల్లో సెలవులు
  • నేడు పివి శత జయంతి ఉత్సవాలపై చర్చ
  • 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ, ఆమోదం
  • సీఎం కేసీఆర్‌, ‌సిఎల్పీ నేత భట్టి మధ్య వాడివేడి చర్చ

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈనెల 28 వరకు జరుగనున్నాయి. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవులు ఇవ్వనున్నారు. మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసి) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. . సమావేశంలో సీఎం కేసీఆర్‌, ‌మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎమ్మెల్సీ ఎన్‌.‌రాంచందర్‌రావు పాల్గొన్నారు. వర్షాకాల సమావేశాలను మొత్తం 18 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. శాసనసభలో గంట పాటు ప్రశ్నోత్తరాలు, అరగంట పాటు జీవో అవర్‌ ‌నిర్వహించనున్నారు. శాసనసభ సమావేశాలలో భాగంగా మంగళవారం దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలపై చర్చ చేపట్టి పలు తీర్మానాలు చేయనున్నారు. పివికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ చర్చలో భాగంగా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అలాగే, ఈనెల 10, 11 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేయనుంది.

సీఎం కేసీఆర్‌, ‌సిఎల్పీ నేత భట్టి మధ్య వాడివేడి చర్చ
. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం కొంత హాట్‌ ‌హాట్‌గా కొనసాగింది. సభని ఎన్ని రోజులు నిర్వహిద్దామని అనుకున్నారని సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగారు. మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిర్వహిస్తామన్నారు సీఎం కేసీఆర్‌. ‌మేము కూడా ప్రజలకు చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్ని విషయాలపై మాట్లాడతామని కేసీఆర్‌ ‌సమాధానం ఇచ్చిన్నట్లు సమాచారం. ఇక మీడియా పాయింట్‌ ఎత్తివేత అంశంపై సీఎం కేసీఆర్‌, ‌భట్టి మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మీడియా పాయింట్‌ ఎలా ఎత్తేస్తారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘మా పాత్రను కూడా మీరే కట్టడి చేస్తే ఎలా..మీరు ఇక్కడ మైక్‌ ఇవ్వరు..కనీసం మీడియా పాయింట్‌ అయినా ఉంచాలి కదా’ అని సీఎల్పీ నేత భట్టి అడిగారు. సభ కంటే మీడియా పాయింట్‌ ఎక్కువైందా..అబద్దాలు మాట్లాడొద్దు…సభలో మైక్‌ ఎం‌దుకు ఇవ్వటం లేదు…సభ్యుల సంఖ్యని బట్టి సమయం ఇస్తారన్నారు.కోవిడ్‌ ‌కారణంగానే డియా పాయింట్‌ ‌ను ఎత్తేశామన్న సీఎం.. సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇస్తామని చెప్పారు.

సీఎం. ఇక కొత్త రెవెన్యూ చట్టం పై సీఎం కేసీఆర్‌ ‌బీఏసీలో చర్చించారు. కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు…అందుకే రికార్డులు సీజ్‌ ‌చేయండని ఉదయమే ఆర్డర్‌ ఇచ్చాం అన్నారు కేసీఆర్‌. ‌రెవెన్యూ చట్టం సభలో పెట్టిన తర్వాత…స్టడీ చేయడానికి 4 రోజులు గడువు ఇవ్వాలని కోరారు భట్టి విక్రమార్క . అంత సమయం ఎందుకు అని అడిగారు సీఎం. మీరు బిల్లు తయారు చేయడానికి 3 యేండ్లు పట్టింది…మేము స్టడీ చేయడానికి 4 రోజులు సమయం ఇస్తే తప్పేముంది అన్నారు భట్టి విక్రమార్క. రెవెన్యూ చట్టం చాలా కఠినంగా చేస్తున్నామన్నారు కేసీఆర్‌. ‌సభ పని దినాలు పొడగించాలనే అనుకుంటే మళ్ళీ బీఏసీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌విపక్ష సభ్యులను కోరారు. సభ్యుల సంఖ్య ప్రకారం సభలో సమయం ఇస్తామని.. దాని ప్రకారం సభ్యులు నడుచుకుని తమ సమస్యలను వినిపించాలని సీఎం సూచించారు. కాంగ్రెస్‌ ‌నాయకులు అబద్దాలు మాట్లాడుతూ.. ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, ఆ విషయాలను సభలో ప్రస్తావిస్తామని కేసీఆర్‌ ‌కూడా కొంత గట్టిగానే సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

Leave a Reply