రాష్ట్ర ప్రభుత్వంపై టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మండిపాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : ప్రత్యేక రాష్ట్రం అందరి జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశించామని…అయితే కలలు మాత్రం నెరవేరడం లేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. జయశంకర్ సార్ కలలు కన్న తెలంగాణ సాకారం కాలేదన్నారు. మంగళవారం ఆయన ప్రొఫెసర్ జయశంకర్‌కు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. కాంట్రాక్టుల్లో అవినీతి తారా స్థాయికి చెరిపోయిందని వెల్లడించారు.
ప్రజలు చైతన్యవంతమైతేనే సమాజం బాగుపడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన యువత సహా రాష్ట్ర ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వ్యవసాయంతో నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.