Take a fresh look at your lifestyle.

పరిశ్రమగా తెలంగాణ వ్యవసాయం

  • రాష్ట్రంలో నాలుగు రకాల విప్లవాలు
  • సంక్షోభం నుంచి సంవృద్ధి దిశగా..
  • వ్యవసాయశాఖ పనితీరు అభినందనీయం
  • కేబనేట్‌ ‌సబ్‌కమిటీ భేటీలో మంత్రి కెటిఆర్‌
  • ‌రైతు బీమా కోసం రూ.1450 కోట్ల రూపాయలు…కెటిఆర్‌ ‌చేతుల మిదుగా ఎల్‌ఐసికి అందచేత

రాష్ట్రంలో వ్యవసాయం పరిశ్రమగా పురోగమించాలని వ్యవసాయంపై ఏర్పాటయిన కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణలో నాలుగు రకాల విప్లవాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. సీఎం కేసీఅర్‌ ‌నాయకత్వంలో రాష్ట్రంలో రెండో హరిత విప్లవం, మత్స్య పరిశ్రమలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్‌ ‌విప్లవం, పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం మొదలైనట్లు వెల్లడించారు. వ్యవసాయరంగంలో సంక్షోభం నుండి సంవృద్ధి వైపు సాధించిన విజయంలో వ్యవసాయశాఖ పనితీరు అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కొనియాడారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యవసాయరంగంపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం బలోపేతమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కమిటీ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి కేసీఅర్‌కి అత్యంత ఇష్టమైనది వ్యవసాయ రంగం. తెలంగాణలో 35 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్నామని పేర్కొంది. తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమేనని కమిటీ పేర్కొంది. రాబోయే తరాలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వైపు నడిపించాలి. ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే వ్యవసాయరంగం మిద ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దృష్టి సారించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సంక్షోభం నుండి సమృద్ది వైపు పనినిస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయంలో వ్యవసాయ శాఖ పని తీరు అభినందనీయమన్నారు. ఇల్లంతకుంట ప్రాంతం ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామా. కానీ నేడు అక్కడ లక్ష టన్నుల దిగుబడి పెరిగిందని తెలిపారు. రాష్ట్రం శక్తిని మార్చే సత్తా వ్యవసాయరంగానికి ఉందని అన్నారు.

రాష్టంలో రెండు కోట్ల పైచిలుకు జనాభా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యవసాయరంగం నుండి ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. రైతు అంటే చిన్నచూపు పోయిందన్న మంత్రి వ్యవసాయరంగాన్ని లాభసాటి రంగంగా మార్చాలని తెలిపారు. వ్యవసాయం పరిశ్రమగా మార్చేందుకు ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లను బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం ప్రొఫెసర్‌ ‌స్వామినాథన్‌, ‌జయతీ ఘోష్‌, ‌పాలగుమ్మి సాయినాథ్‌, ‌సుభాష్‌ ‌పాలేకర్‌ ‌ను మంత్రి వర్గ ఉపసంఘం సంప్రదించాలన్నారు. అమెరికాలోని అయోవాలో ఉన్న అగ్రికల్చర్‌ ‌మ్యూజియంను అధికారుల బృందం సందర్శించాలన్నారు. 32 జిల్లాలలో 50 నుండి 100 ఎకరాలలో డెమానిస్ట్రే ‌ఫార్మ్ ‌లు ఏర్పాటుకు యోచిద్దామన్నారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. వేరుశనగ, టమాటా వంటి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా నవీన ఆవిష్కరణలు రావాలన్నారు. చదువురాని వారు కూడా స్మార్ట్ ‌ఫోన్ల రాకతో ఎంతో అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలన్నారు. రైతులకు ఫ్యాబ్లెట్‌ ‌లు అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు. డ్రోన్లు, ఇతర వ్యవసాయ ఆవిష్కరణల వైపు యువతను ప్రోత్సహించాలన్నారు.

గ్రామిణ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్రాల వివరాలను ఉబరైజేషన్‌ ‌పక్రియ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో వరి సాగును తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరాలకు సరిపడా పండ్లు, కూరగాయలు పండించడం లేదు. చిన్న కమతాలలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని అన్నారు. మూడు శాతం జనాభా ఆధారపడ్డ అమెరికా వ్యవసాయ రంగం నుండి ఆ దేశ జీడీపీలో తొమ్మిది శాతం సంపద సమకూరుతుందన్నారు. వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలని ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్ది అభిప్రాయ పడ్డారు. యాసంగిలో వేరుశెనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని చెప్పారు. తెలంగాణలో ఆప్లాటాక్సిన్‌ ‌రహిత వేరుశెనగ రావడం ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ ఉం‌టుందన్నారు. రాష్ట్రంలోనూతన వేరుశెనగ వంగడాలను కనుగొనేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ఇంకా సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ‌ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ ‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ ‌రావు, వీసీలు ప్రవీణ్‌ ‌రావు, నీరజా ప్రభాకర్‌, ‌మార్కెటింగ్‌ ‌డైరెక్టర్‌ ‌లక్ష్మీబాయి, ఆయిల్‌ ‌ఫెడ్‌ ‌చైర్మన్‌ ‌రామకృష్ణారెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ ‌వెంకట్రామ్‌ ‌రెడ్డి, అగ్రోస్‌ ఎం‌డీ రాముము తదితరులు పాల్గొన్నారు.

రైతు బీమా కోసం రూ.1450 కోట్ల రూపాయలు…కెటిఆర్‌ ‌చేతుల మిదుగా ఎల్‌ఐసికి అందచేత
తెలంగాణలో రైతు బీమా కోసం రూ.1450 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు 2021 – 2022 సంవత్సరానికి గాను రైతుభీమా కోసం ఎల్‌ఐసీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ ‌చేతుల మిదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.అన్నం పెట్టే రైతన్న ఆత్మవిశ్వాసంతో సాగు చేసేందుకే వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, వందశాతం పంటల కొనుగోళ్లతో తెలంగాణ రైతాంగం ఆత్మస్థయిర్యం పెరిగిందని ఆయన తెలిపారు. సమైక్యరాష్ట్రంలో నష్టపోయిన రైతాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చిత్తశుద్దితో వ్యవసాయరంగ పథకాలు అమలుచేస్తున్నారని అన్నారు.

Leave a Reply